Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKatrina Kaif: త‌ల్లి కాబోతున్న ‘మ‌ల్లీశ్వ‌రీ’ హీరోయిన్ - బేబీ బంప్ ఫొటోల‌తో గుడ్‌న్యూస్

Katrina Kaif: త‌ల్లి కాబోతున్న ‘మ‌ల్లీశ్వ‌రీ’ హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోల‌తో గుడ్‌న్యూస్

Katrina Kaif: బాలీవుడ్ క‌పుల్ విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినా కైఫ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించారు. త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది క‌త్రినాకైఫ్‌. విక్కీ కౌశ‌ల్ కూడా సేమ్ ఫొటోను షేర్ చేశాడు. ‘మా జీవితంలో కొత్త ఛాప్ట‌ర్ మొద‌లుకాబోతుంది. ఈ అంద‌మైన ద‌శ‌కు ఆనందంగా స్వాగ‌తం ప‌లుకుతున్నాం’ అంటూ విక్కీ, క‌త్రినా పేర్కొన్నారు. క‌త్రినా షేర్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు వారికి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

- Advertisement -

సినిమాల‌కు దూరం…
క‌త్రినాకైఫ్ త‌ల్లి కాబోతున్న‌ట్లుగా గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాల‌కు దూరంగా ఉండ‌టం, మీడియా కంట ప‌డి చాలా రోజులు కావ‌డంతో ఈ పుకార్ల‌కు బ‌లం చేకూరింది. మంగ‌ళ‌వారం ఈ రూమ‌ర్స్‌కు చెక్‌ పెడుతూ త‌ల్లిగా ప్ర‌మోష‌న్ పొందుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Also Read- OG Advance Bookings: 50 కోట్లు దాటిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ – రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్

మెర్రీ క్రిస్మ‌స్ త‌ర్వాత‌…
మాతృత్వ బంధం కార‌ణంగానే క‌త్రినాకైఫ్ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజైన మెర్రీ క్రిస్మ‌స్ మూవీతో చివ‌ర‌గా బాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది క‌త్రినాకైఫ్‌. ఆ త‌ర్వాత చాలానే అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని రిజెక్ట్ చేస్తూ వ‌చ్చింది.

2021లో పెళ్లి…
2021లో విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లిచేసుకుంది క‌త్రినాకైఫ్‌. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారు ఈ జంట‌. రాజ‌స్థాన్‌లో విక్కీ, క‌త్రినా పెళ్లి వేడుక జ‌రిగింది. పెళ్లికి ముందు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసిన క‌త్రినాకైఫ్.. పెళ్లి త‌ర్వాత సినిమాల‌ను చాలా త‌గ్గింది. కుటుంబానికే టైమ్ కేటాయిస్తూ వ‌స్తోంది.

https://www.instagram.com/p/DO75cvWjf__/

టాప్ హీరోయిన్‌…
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్న‌ది క‌త్రినాకైఫ్‌. న‌మ‌స్తే లండ‌న్‌, రేస్‌, రాజ్‌నీథి, అగ్నిప‌థ్‌తో పాటు ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది. ఒకానొక ద‌శ‌లో బాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకునే హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగింది. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులో వెంక‌టేష్ మ‌ల్లీశ్వ‌రితోపాటు బాల‌కృష్ణ అల్లరి పిడుగు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్‌లో బిజీగా ఉండ‌టంతో అల్లరి పిడుగు త‌ర్వాత తెలుగులో మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేదు.

Also Read- Bigg Boss Nominations: లత్కోర్ పనులు నేను చేయను.. హరీష్, డీమాన్ మధ్య హీటెక్కించిన గొడవ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad