Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభSSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో?!

SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో?!

- Advertisement -

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో ముహూర్తం కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా ఆ మధ్య ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింద‌ని.. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

అయితే, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత గ్యాప్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. ఇది నిజం కాదని త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు నటీనటుల ఎంపిక కూడా పూర్తి కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట. బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ ను మహేష్ కోసం విలన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట.

ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో పాటు సినిమాలో లాంగ్ రన్ పాత్ర కావడంతో బాలీవుడ్ హీరోలైతే అక్కడ మార్కెటింగ్ కు ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మన తెలుగు సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ ఉండడంతో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాను కూడా అన్ని దక్షణాది బాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News