Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభBollywood to Hollywood: హాలీవుడ్ లోకి మరో ఇండియన్ యాక్టర్

Bollywood to Hollywood: హాలీవుడ్ లోకి మరో ఇండియన్ యాక్టర్

ఇషాన్ ఖట్టర్ ఈ పేరు మీరు వినే ఉంటారు. బాలీవుడ్ లో యాక్టర్.  నిజానికి పెద్ద యాక్టర్ ఏమీ కాదు కానీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మాజీ బాయ్ ఫ్రెండ్ గా మీకు ఇషాన్ పేరు సుపరిచితంగా ఉంటుంది.  పైగా హిందీ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు కూడా.  ఇంక సెలబ్రిటీ స్టేటస్, పబ్లిసిటీకి కొరతేముంది.  అప్పుడప్పుడు ఇలా పెద్దపెద్ద ఆఫర్సు వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

‘ద పర్ఫెక్ట్ కపుల్’ అనే సినిమాలో హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్మన్ తో కలిసి ఇషాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఇషాన్ ఇన్స్టాలో అనౌన్స్ చేశాడు.  సినిమాల్ల పెద్దగా ఛాన్సులు, హిట్లు కొట్టకపోయినా జాన్వీ, అనన్యా పాండే వంటి స్టార్లతో అఫైర్ల వల్ల ఈ సెలబ్రిటీ కిడ్ పాపులర్ అయ్యాడని చెప్పుకోక తప్పదు. 

ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు కనక వర్షం కురుస్తుంది.  అదే ఇండియన్ యాక్టర్స్ ను ఎవరినైనా పెడితే ఇంకా ఎక్కువ దండుకోవచ్చన్న కారణంగా హాలీవుడ్ ఈమధ్య ఇండియన్ యాక్టర్స్ ను తమ సినిమాల్లో ప్రయారిటీ ఇస్తోంది.  ఈనేపథ్యంలోనే ఇషాన్ కు మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని బాలీవుడ్ చెబుతోంది. ఇటు టాలీవుడ్ లోనూ హాలీవుడ్ పై మోజు పెరిగింది. ఇంగ్లీష్ మూవీని డైరెక్ట్ చేయాలని రాజమౌళి కలలు కంటూంటే డైరెక్ట్ హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసేయాలనే తాపత్రయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సర్వం ఒడ్డుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News