Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAkhanda 2: బోయపాటి బాలయ్య కాంబో ఈజ్ బ్యాక్! ఫ్యాన్స్‌కు మళ్ళీ పూనకాలే

Akhanda 2: బోయపాటి బాలయ్య కాంబో ఈజ్ బ్యాక్! ఫ్యాన్స్‌కు మళ్ళీ పూనకాలే

Akhanda Thandavam: టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండ ప్రభంజనం మళ్ళీ మొదలైంది! నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సీక్వెల్, ‘అఖండ తాండవం బ్లాస్టింగ్ రోర్’ వీడియో విడుదల అయ్యి, అభిమానులలో అడ్రినలిన్ రష్‌ని తారాస్థాయికి చేర్చింది. ఇది కేవలం గ్లింప్స్ కాదు, రాబోయే మాస్ జాతరకి ఒక వార్నింగ్ సైరన్!

- Advertisement -

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ నుంచి విడుదలైన ‘బ్లాస్టింగ్ రోర్’ వీడియో, బోయపాటి తన మార్క్ ఎలివేషన్లలో ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. బోయపాటి శ్రీను కేవలం ఒకే ఒక్క డైలాగ్‌తో సీక్వెల్ పై అంచనాలను శిఖరాగ్రానికి చేర్చాడు.

“సౌండ్ కంట్రోల్ పెట్టుకో! ఏ సౌండ్‌కి నవ్వుతానో… ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలీదు కొడకా! ఊహకు కూడా అందదు”

ALSO READ: https://teluguprabha.net/cinema-news/upasana-twins-rumours-allu-family-missing-mega-event/

ఈ డైలాగ్ విని థియేటర్ల దగ్గర సింగిల్ స్క్రీన్లపై పూల వర్షం కురవడం ఖాయం. బాలయ్య తనదైన డైలాగ్ డెలివరీతో ఈ డైలాగ్‌కు ప్రాణం పోశాడు. ఇక బాలయ్య అంటే మన థమన్ ఇచ్చే మ్యూజిక్ గురించి తెలిసిందేగా, స్పీకర్లు బద్దలవాల్సిందే. థమన్ ఈ సీక్వెల్‌కి కూడా అఖండ స్థాయి బీజీఎమ్ అందించినట్టు తెలుస్తోంది. ‘బ్లాస్టింగ్ రోర్’ వీడియోలో వినిపించిన ఎలివేషన్ సౌండ్, థియేటర్ లో ఏ స్థాయి లో ఉండబోతుంది అనడానికి ఒక చిన్న వార్నింగ్ లాగా అనిపించింది.

బోయపాటి, ఈసారి యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్‌లు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో డిజైన్ చేసినట్టు తెలుస్తుంది విడుదలైన టీజర్స్, గ్లింప్స్ చూస్తుంటే. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా, బాలయ్య అభిమానులకు ఒక ముందస్తు పండగ వాతావరణం ఏర్పడింది. మొదటిరోజు రికార్డుల వేట మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ 5 న మాత్రం థియేటర్లు అన్ని కూడా “సౌండ్ కంట్రోల్ పెట్టుకోకపోతే’ స్పీకర్లు బద్దలవడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad