కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం'(Brahma Anandam Teaser). ఈ మూవీలో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు. ఆర్.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేసింది. 1.53 నిమిషాల సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో వెన్నెల కిశోర్, గౌతమ్, బ్రహ్మానందంల కామెడీ అదిరిపోయింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.