ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ చెప్పిన వాటికి రుద్రాణి వస్తున్నా కావ్య సాక్ష్యాలతో ఇప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు అంటుంది. రూమ్‌లోకి వచ్చిన రుద్రాణి ఇదేమి విడ్డూరం అందరి మెడలో నగలు మెరిసిపోతుంటే కావ్య మెడ మాత్రం బోసిపోయి ఉంది దుగ్గిరాల ఇంటి కోడలు ఇలాగేనా ఉండేది అంటుంది. నా నగల గురించి మీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటుంది కావ్య. నువ్వు కావ్యకి బోలెడన్ని నగలు ఇచ్చావు కదా వదిన అని అపర్ణని అడుగుతుంది. నగలు జాగ్రత్తగానే ఉన్నాయా అని అడుగుతుంది రుద్రాణి. నగలు ఎవరైనా దొంగతనం చేసారా అని అడుగుతుంది. మొత్తానికి అందరూ అన్ని మాటలు అన్నాక అపర్ణ నగల విషయం అడుగుతుంది. నీకు నచ్చకపోయినా ఇలాంటి ఫంక్షన్స్‌కు వచ్చినప్పుడు వేసుకోవాలి కదా అని అడుగుతుంది. అప్పుు తన మెడలో ఉన్న హారాన్ని తీసి కావ్య మెడలో వేస్తుంది. అపర్ణ చేసిన పనికి కావ్య ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక ఆతర్వాత స్వప్నను సీమంతం కుర్చో పెట్టి అన్ని రకాల సంప్రదాయాలతో సీమంతం చేసి స్వప్నకు పండంటి బిడ్డ పుట్టాలని అందరూ ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడే కనకం సంషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వప్నకు బిడ్డ పుడితే కనకం అమ్మమ్మ, రుద్రాణి నానమ్మ అవుతారు అని అందరూ మాట్లాడుకుంటారు. కానీ రుద్రాణి, రాహుల్ మాత్రం ఎప్పుడెప్పుడు ఆ కావ్య, రాజ్‌ల బండారం బయటపెడదామని ఆరాట పడతారు.
మొత్తానికి రాహుల్ కావ్య నగలు తాకట్టు పెట్టిన బిల్ సంపాదిస్తారు. ఇంట్లో అందరూ భోజనాలు చేస్తున్న సమయానికి రుద్రాణి వస్తుంది. మీ అక్కాచెల్లెల్ల నటనలు చూసి చప్పట్లు కొట్ట కొట్టి చేతులు నొప్పి వస్తున్నాయి. దుగ్గిరాల ఇంటికి కోడలు అయిన కావ్య ఆస్థి అంతా తన పేరు మీద పెట్టారు ఇప్పుడు తను ఈ ఇంటి పరువు తీస్తుంది అంటుంది. హాస్పిటల్ బిల్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు అని నిలదీస్తుంది. హాస్పిటల్ బిల్ కట్టడం కోసం 5 లక్షల రూపాయిల కోసం నగలను తాకట్టు పెట్టింది అని చెప్తుంది. రిసిప్ట్ అందరికీ చూపిస్తుంది. రాజ్ రుద్రాణిని ఇంటి పరువు తీయడమే నీకు పనా అని తిడుతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.