Monday, January 20, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 20th Episode: అనామిక మళ్లీ ప్లాన్ వేసింది.. ఈసారి రూ.100 కోట్ల విషయం...

Brahmamudi January 20th Episode: అనామిక మళ్లీ ప్లాన్ వేసింది.. ఈసారి రూ.100 కోట్ల విషయం బయటపడుతుందా..

ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య రాత్రి ఇంట్లో రాజ్‌తో ఆ 100 కోట్లు మోసం చేసినవాడిని ఎలా అయినా పట్టుకుని మనం ఈ ఇబ్బందులన నుంచి బయటపడాలని ప్లాన్లు వేస్తూ చెప్తుంది. వాడు ఎలా అయినా దొరికుతాడు మన అదృష్టం బాగుంటే తొందరగా దొరుకుతాడు. వాడు అదృష్టం బాగుండి మన దురదృష్టం బాగోగ వాడు దొరకకపోతే ఎలా అని రాజ్ అంటాడు. మీరు అలా ఆలోచించవద్దు. పాజిటివ్‌గా ఉండాలి అంటుంది.

- Advertisement -

మరోవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కలిసి ధాన్యలక్ష్మితో కావ్య నగలు తాకట్టు పెట్టిన విషయం గురించి మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతారు.ఆ మాటలు విని ధాన్యం ఇంట్లో డబ్బులు లేకపోవడం కాదు ఆ కావ్య, రాజ్ కలిసి ఏవో ప్లాన్‌లు వేస్తున్నారు అంటుంది. ముందు ఉండు రాజ్, కావ్య ఇలా చేస్తున్నా ఇదంతా వెనక ఉండి నడిపిస్తుంది సుభాష్ అన్నయ్య అపర్ణ వదినలే అని నిప్పులో ఆజ్యం పోస్తుంది రుద్రాణి.

మనం ఆస్తుల గురించి ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టామో అప్పటి నుంచి వాళ్ల ప్రవర్తన మారిపోయింది అంటుంది. ముసలోడు మంచం ఎక్కకముందే ఆస్తి మొత్తం వాళ్ల పేరు మీద మార్చేసారు మా అమ్మని సైలెంట్‌లో పెట్టేసారు, ప్రకాశం అన్నయ్యను కుడా వాళ్ల గ్రిప్‌లో పెట్టుకున్నారు ఇదంతా వాళ్ల ట్రాప్ అంటుంది రుద్రాణి. ఈ మాటలు అన్ని ధాన్యలక్ష్మి నమ్మేసి రెచ్చిపోయి ఊగిపోతుంది.

మరోవైపు అనామిక సామంత్ కలిసి మందు తాగుతూ రూ.5 లక్షలు లేక నగలు తాకట్టు పెడితే ఇంట్లో అంత రచ్చ జరిగిందా అని ఆనందపడతారు. వాళ్లు ఇంకా అప్పులు చేసి రచ్చ చేసి అందరి ముందు బయటపెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటుంది. సామంతం మాత్రం అలా చేయవద్దు అలా చేస్తే ఈజీగా ఇంట్లో వాళ్లు హెల్ప్ చేస్తారు అప్పుడు ఈ ప్రాబ్లెమ్‌ నుంచి బయటపడతాడు అంటే నాకు కావాల్సింది వాళ్ల ఏడుపులు కంపెనీ కాదు అని వేరే ప్లాన్ వేస్తుంది అనామిక.
అప్పుడు రుద్రానికి ఫోన్ చేసి మీకు ఒక మంచి న్యూస్ పంపిస్తాను ఆ ఇంటిని షేక్ చేయండి దాన్ని ఉపయోగించి ఆస్తులు రాయించుకుంటారో, కొంపలు విడగొడతారో మీ ఇష్టం అంటుంది. ఏమి చేసినా ఆ ఇంట్లో ఒక్కరూ కుడా హ్యాపీగా ఉండకూడదు అంటుంది. రేపు ఉదయాన్నే ఇంటికి వస్తుంది ఇది మీకు మాత్రమే గుడ్‌న్యూస్ అంటుంది. సరే అని ఫోన్ పెట్టేస్తే పక్కనే స్వప్న ఉండటం చూసి టెన్షన్ పడుతుంది.

రుద్రాణి మాటలకు, బిహేవియర్‌కు స్వప్న అనుమనిస్తుంది. ఆతర్వాత ఇందిరా దేవి తన నగలు తీసుకుని కావయ దగ్గరకు వచ్చి వీటి అవసరం నాకంటే నీకే ఎక్కువ అని ఇస్తుంది. కంపెనీ అకౌంట్స్ హోల్డ్‌లో ఉన్నాయి అందుకే హాస్పిటల్ బిల్ నగలు తాకట్టు పెట్టి కట్టాము అని అబద్దం చెప్తుంది కావ్య. తర్వాత హాల్పిటల్‌లో ఉన్న కళ్యాణ్ దగ్గరికి అప్పు వస్తుంది. కానీ అప్పును చూసి ఎవరో అనుకోని బ్రమ పడుతూ ఉంటాడు కళ్యాణ్. అప్పు వచ్చి మాట్లాడినా నమ్మకుండా మోహం తిప్పేసుకుంటాడు. ఇక అప్పు వడు నమ్మేలా లేడు అని గట్టిగా గిల్లడంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడు నిజంగానే అప్పు వచ్చిందని ఆనందంతో అప్పని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి సీతారామయ్యను చూస్తారు.అక్కడ ఇంట్లోకావ్య అపర్ణకు కాఫీ ఇస్తుంటే కారణాలు చెప్పనివాళ్ల దగ్గర తీసుకోను అన చెప్పండి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News