ఈరోజు ఎపిసోడ్లో కావ్య సుభాష్ దగ్గరికి వచ్చి జరిగేది ఆపమంటే చేసేది నువ్వు ఆపాల్సింది నా భర్తనా అని అపర్ణ అడుగుతుంది. అప్పుడు నేను ఏమి చేసినా ఈ కుటుంబం మంచి గురించే అంటుంది. చెప్పడం కాదు ఆచరణలో ఉండాలి అంటుంది అపర్ణ. మేము ఏమి చేయము నువ్వు మాట్లాడిన మాటలకు వాళ్లు కోర్టుకి వెళ్లే తీరతారు అని వెళ్లిపోమంటుంది. అక్కడ రూమ్లో రాజ్, కావ్యలు ఏమి చేయాలండి, తెల్లవారితే కోర్టుకి వెళ్తారు పోని 100 కోట్ల అప్పు ఉంది అని చెప్తే అమ్మమ్మ గారు బాధపడతారని ఈ రాత్రికి ఏమి చేయగలము అని ఆలోచిస్తారు. మరోవైపు రుద్రాణి, రాహుల్ తాగుతూ ఆస్తి వచ్చేస్తుందని ఆనంద పడుతూ డ్యాన్స్ వేస్తుంటారు. మధ్యలో స్వప్న కుడా జాయిన్ అవుతుంది.
వాళ్ల డ్యాన్స్ ఆపి ఏంటి అప్పుడే ఆస్తి వచ్చేసినట్టు ఆనంద పడిపోతునారు. జస్ట్ నోటీస్ వచ్చింది అంతే ఏదే కేస్ గెలిచినట్టు ఆనంద పడుతునారు అని అడుగుతుంది. దానికి రుద్రాణి మా నాన్న నీ పేరు మీద రాసి ఇచ్చిన ఆస్తి జస్ట్ అనుభవించడానికే కానీ హక్కు మొత్తం మీ చెల్లి కే ఉంది అని రెచ్చగొడుతుంది. అయినా స్వప్న గట్టిగా చెప్పి మీరు చచ్చినా గెలవలేరు అని చెప్పి వెళ్లిపోతుంది. ఉదయాన్నే ప్రకాషం వాళ్ల అమ్మ అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి లాయిర్ ఇక్కడికి వస్తున్నాడు 5 నిమిషాల్లో బయలుదేరాలి అంటే దానికి ప్రకాషం మనం చేసే పని మంచిదేనా బయట వాళ్లతో గొడవ అయితే సర్దిచెప్పుకుంటాము మా అన్నయ్యకి ఎదురు వెళ్లమంటావా అంటాడు.
అప్పుడు దాన్యం మనం చేసే పని చెడ్డది కాదు మన ఆస్తి కోసం మనం పోరాడుతున్నాము అని తీసుకెళ్లిపోతుంది. ఈలోగా ఇంటికి లాయిర్ వస్తాడు. ఎందుకు వచ్చారు అంటే మేమే పిలిపించాము అని ప్రకాషం, ధాన్యలక్ష్మి చెప్తారు. దానికి ఇందిరా దేవి మన ఇంటి పరువు నువ్వు తీస్తావా, నీ భార్యకి చెప్పలేవా అంటుంది. మావగారికే విలువ ఇవ్వని కోడలు, ఇంక చిన్న మావకి ఏమి విలువ ఇస్తుంది అంటుంది దాన్యం. ఈలోగా కావ్య వచ్చి మీరు మంచి పనే చేశారు. అయితే నేను లాయిర్ గారెని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అంటుంది. కావ్య తాత ఆస్తి, మనవలకి వస్తుంది కానీ కొడుకులకు రాదు కదా అని ప్రశ్నిస్తుంది.
దానికి లాయిర్ అలా కుదరదు కదా గెలవలేము కదా మీరు వేస్తే కేస్ కొట్టేస్తారు అని లాయిర్ చెప్తాడు. అప్పుడు దాన్యం మేము వేయకపోతే నా కొడుకుతో వేయిస్తాను అంటే ఈలోపు కళ్యాణ్ వచ్చి నేను చచ్చినా వేయను నా సంతంకం లేకుండా నువ్వు ఎలా వేస్తావు అని అడుగుతాడు. తల్లిగా నేను చెప్తున్నా వేయాల్సిందే అంటే కొడుకుగా నేను తిరస్కరిస్తున్నాను అంటాడు. ధాన్యలక్ష్మి ఎంత చెప్పినా కల్యాణ్ వినడు. అక్కడ తాతయ్య చావు బతుకుల మీద ఉంటే మీకు ఆస్తులు కావాలా నేను అడిగినా నాకు ఆస్తులు కావాలని అని అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.