ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ కావ్యకి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చెస్తే స్వప్న కొనుక్కున్న నెక్లెస్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఎందుకు తెచ్చారు అని అడుగుతుంది. ఈ నక్లెస్ విషయంలో తను చాలా ఫీల్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ చేయి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటాడు రాజ్. అందరి గురించి బాగానే అర్థంచేసుకుంటారు నన్ను మాత్రం పట్టించుకోవు అని అంటుంది కావ్య. మరోపక్క రుద్రాణి, ధాన్యలక్ష్మి ఆ ఫంక్షన్ చూస్తూ ఉండలేక బయటికి వచ్చి మనం మగపిల్లలను కన్నాది వీళ్లకి ఇవ్వడానికి ఏమో బోర్ల పడ్డాం అనుకుంటారు. అలా బయట వేసిన విరిగిన కుర్చీల్లో కూర్చోబోతుంటే ఆగండి అని ఈవెంట్ మేనేజర్ శీను అంటాడు. ఇందులో కూర్చోవద్దు వేరే దాంట్లో కూర్చోండి అంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి అని చెంప మీద మళ్లీ కొడుతుంది రుద్రాణి.
పంతానికి పోయి ధాన్యం, రుద్రాణి కొట్టుకుని మరీ మొదట నేనే కుర్చోవాలి అని వెళ్లి రుద్రాణి కూర్చొంటుంది. ఇంకేముంది దెబ్బకి కింద పడుతుంది. కనకం మీద అరుస్తుంటే నేను కూర్చోవద్దని చెప్పాను మీరే కూర్చున్నారు అని కనకం అంటే దానికి ధాన్యలక్ష్మి సపోర్ట్ చేస్తుంది. అక్కడ స్వప్న రేడీ అవుతుంటే కావ్య వచ్చి నక్లెస్ ఇస్తుంది. అది చూసి స్వప్న చాలా సంతోషపడుతుంది. కానీ కడుపు మండిన రుద్రాణి, ధాన్యలక్ష్మి మాత్రం మళ్లీ గొడవ పెట్టడానికి వచ్చి భలేగా అక్కాచెల్లెలు ప్లాన్‌లు వేసి నక్లెస్ సొంతం చేసుకున్నారు అంటారు. మాకు అక్కడ తిండి పెట్టడానికి ఏడ్చి ఇక్కడ అక్కకు దుగ్గిరాల ఇంటి గిఫ్ట్ అంటూ మెడలో బంగారం వేసింది ఇది వేస్ట్ ఖర్చు కాదా అని అడుగుతారు. రాజ్ వచ్చి ఎప్పుడు మా అత్తగారి ఇంటికి వచ్చినా గొడవ లేకుండా ఇంటికి వెళ్లము కదా గొడవ జరగకపోతే ఆశ్చర్యపడాలి కానీ అని గడ్డిపెడతాడు. దానికి ఇంట్లో వాళ్లు సరిగ్గా చెప్పావు అంటారు.
కావ్య కాదు నేను తీసుకొచ్చాను ఇక్కడికి నేను ఇమ్మని తీసుకొచ్చాను అంటాడు రాజ్. దీనికి కావ్యను ఎందుకు తప్పు పడతారు అంటాడు. రాహుల్ వచ్చి రుద్రాణిని బయటికి తీసుకెళ్లి తాతాయ్య హాస్పిటల్ బిల్‌కు వాళ్లు చెప్పిన సాకులు అబద్దాలు. వాళ్లు కావ్య నగలు తాకట్టు పెట్టి క్యాశ్ రూపంలో బిల్ కట్టారని చెప్తాడు. అప్పుడు రుద్రాణి బాగా చెప్పావు ఇప్పుడు చూడు వాళ్ల పని చెప్తాను అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.