Buchi Babu Sana: తాజాగా బుచ్చి బాబు సానా, ఆయన దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్రేజ్జీ అప్‌డేట్ ని ఇచ్చాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు పాన్ వరల్డ్ మూవీ ‘పెద్ది’ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దీనికి డాన్స్ కొరియోగ్రఫీని అందించాడు.
ఓ ఎత్తైన కొండపై నిలబడి చరణ్ డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వచ్చి ఎంతగానో వైరల్ అయింది. ఇది చూసిన ఫ్యాన్స్ చరణ్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడని కామెంట్స్ పెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ చేసిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో పరాజయాన్ని చూసింది. దాంతో, ‘పెద్ది’ మూవీతో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టి పాన్ ఇండియా వైడ్‌గా భారీ సక్సెస్ చూడాలని చరణ్ ఎంతో శ్రమిస్తున్నాడు.
Also Read – NTR: ఎన్టీఆర్‌కు ‘డ్రాగన్’ ఫుటేజ్ సంతృప్తి ఇవ్వలేదా?
ఇప్పటికే, ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ కి విపరీతమైన ఆదరణ దక్కింది. ఏకంగా ఐపీఎల్ లో క్రికెటర్స్ సైతం ఈ షాట్ ని ఉపయోగించడంతో బాగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 2026, మార్చి 27న రిలీజ్ చేయడానికి బుచ్చిబాబు అండ్ టీమ్ బాగా శ్రమిస్తోంది. అయితే, తాజాగా.. ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ని దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన త్వరలో ఓ లవ్ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్టుగా వెల్లడించాడు.
దీంతో ‘పెద్ది’ ప్రమోషన్స్ మెల్లగా మొదలవబోతున్నాయని.. ఇకపై వరుసగా అప్‌డేట్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ బాగా ఉత్సాహంలో ఉన్నారు. ఫస్ట్ సింగిల్ గా లవ్ సాంగ్ ఆ తర్వాత టీజర్, ట్రైలర్.. మిగతా సాంగ్స్.. ఇలా వరుసగా అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. కాగా, ఈ సినిమాలో కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే, ఫస్ట్ షాట్ కి ఇచ్చిన బీజీఎం అదిరిపోయిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
Also Read –AA22A6: అల్లు అర్జున్, అట్లీ మూవీపై బాలీవుడ్ హీరో సెన్షేషనల్ కామెంట్స్..


