ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప జాతర ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమా 1800కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. సౌత్ తో పోల్చుకుంటే.. ఈ సినిమా బాలీవుడ్ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దీంతో బన్నీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని.. ఆయనతో ఓ సినిమా తీయాలని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తునట్లు టాక్ వినిపిస్తుంది.
పుప్ప సినిమా కూడా బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన పుష్ప 2 సినిమా అయితే ఏకంగా 800 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఇదిలా ఉంటే పుష్ప సక్సెస్ కి క్రేజ్ కి ఫ్లాట్ అయిన బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ మీటింగ్స్ కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా బన్నీతో బాలీవుడ్ అగ్ర ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ మధ్య పుష్ప 2తో బన్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో తెరకెక్కిన పఠాన్ సినిమా కలెక్షన్లని క్రాస్ చెయ్యడంతో బన్నీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది ఆ నిర్మాణ సంస్థ.
దీనికి అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఈ రికార్డ్ ని యశ్ రాజ్ ఫిల్మ్స్ లోనే వస్తున్న మరో సినిమాతో బ్రేక్ చేద్దామంటూ రిప్లై ఇచ్చారు. దాంతో వీళ్లిద్దరూ కలిసి సినిమా చెయ్యబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్, బన్నీ కలిసి ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నారంటూ మరో చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమాకి కో ప్రొడ్యూసర్ గా యశ్ రాజ్ ఫిల్మ్స్ చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు అట్లీ బన్నీతో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ షారూఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి హిట్ కొట్టిన అట్లీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. దాంతో అట్లీ-బన్నీ తో యశ్ రాజ్ మూవీ చేసే చాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసిందే. చాలా రోజుల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న పరిస్థితుల్లో ఆయన కొంత కాలం గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా నెల, రెండు నెలలు ఆయన మరే సినిమాపై వర్క్ చేసే ఆసక్తి లేదని సమాచారం. రెండు నెలల తర్వాత.. బన్నీ త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా ఉంటుందని సమాచారం. అయితే.. బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి.