యువ నిర్మాత బన్నీ వాసు ఇటీవల ‘మిత్రమండలి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనపై, తన సినిమా కావాలనే డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తున్నారని ఆయన భావోద్వేగంగా స్పందించారు. ఎంత ట్రోలింగ్ చేసినా తాను తొక్కితే పడిపోయే రకం కాదని బన్నీ వాసు హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతోంది.
బన్నీ వాసు మాట్లాడుతూ ‘‘‘ప్రియదర్శి’గారు ఎంతో ఓపికగా మాతో ట్రావెల్ చేశారు. దీపావళికి అక్టోబర్ 16న వస్తోన్న ‘మిత్రమండలి’ సినిమాను ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. డైరెక్టర్ విజయేంద్రను చూస్తుంటే నాకు కుళ్లుగా ఉంది. తనకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంచి మనసున్న వ్యక్తి. అందరూ బావుండాలని కోరుకుంటాడు. దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఒకదాన్ని మించి మరోటి హిట్ కావాలని కోరుకుంటున్నాను.’’ అని తన సినిమాలో పని చేసిన అందరికీ పేరు పేరున థాంక్స్ చెప్పిన ఆయన తర్వాత ట్రోలర్స్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
‘‘కొందరు ‘ఎక్కడ నవ్వాలో చెప్పండ్రా’ అని ట్రైలర్ కింద కామెంట్స్ పెడుతున్నారు. నేను వారికి చెప్పేదొక్కటే. థియేటర్‌కు వస్తే ప్రతీ నిమిషం నవ్వుతారు. మీరు నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి. ముందు సినిమా చూసి నవ్వాలో వద్దో.. తర్వాత చెప్పండి. అందరూ బావుండాలని నేను అనుకుంటాను. అలా కాకుండా నేను ఒక సినిమాను తొక్కితేనే పక్క సినిమా ఎదుగుతుంది అని అనుకుంటే అది మీ ఖర్మ. ఎవరం ఏం చేయలేం. సినిమా బావుంటే చూస్తారంతే. ప్రేక్షకుల తీర్పుకి గౌరవం ఇవ్వాలి. డబ్బులు పెట్టి నెగటివ్ ట్రోలింగ్ చేస్తే సినిమా తగ్గుతుంది అని అనుకుంటే అది చిన్నపిల్లాడి తత్వం.
ఒక సినిమా వస్తే మరో సినిమాను తొక్కటానికి నెగటివ్ ప్రచారం చేస్తే ఎదుగుతాం అనుకుంటే తప్పు. పైన ఆ దేవుడు, ప్రేక్షకులున్నారు. వాళ్లే చూసుకుంటారు. కాంపిటీషన్‌తో చేసే యుద్ధంలో ధర్మం ఉండాలి. నా సినిమా బాగోలేక.. పక్క సినిమా బావుంటే ఆ సినిమానే ఆడాలని కోరుకుంటాను. ఏదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు.. ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడని అనుకుంటున్నారు. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను తల మీద వెంట్రుకనే తీసి ఇస్తున్నా.. అది నా సంస్కారం. నేను పరిగెడుతుంటానే ఉంటాను. అందులోనే నా గెలుపు ఉంటుంది. ఎన్ని ట్రోలింగ్స్ చేసినా చేసుకోండి. ట్రోలింగ్ చేసేవాళ్లు ఎక్కువ డబ్బులు తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీని నెగటివ్‌గా మార్చటానికి చీప్‌గా కోడ్ చేయవద్దు. సినిమా రిలీజ్ తర్వాత కూడా సినిమాపై నెగటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలనుకునేవారికి నేను వెల్కమ్ చెబుతున్నాం. సినిమా బావుంటే ఆడుతుంది. లేదంటే లేదు’’ అన్నారు.
‘మిత్రమండలి’ చిత్రాన్ని బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.


