Mirai Movie: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 55 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. హిందీ వెర్షన్‌కు ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు కంటే సెకండ్ డే హిందీలో ఈ మూవీ ఎక్కువగా కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా మిరాయ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మరో పది కోట్ల దూరంలోనే ఉంది. మండే లోగా ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఒకటి కొంటే మరొకటి ఫ్రీ…
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మిరాయ్ మూవీకి రెండో రోజు ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీగా మేకర్స్ ఆఫర్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రిలీజైన వారం, పది రోజుల తర్వాత బై వన్ గెట్ వన్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. కనీసం ఫస్ట్ వీకెండ్ కాకుండానే మిరాయ్ సినిమాకు ఈ ఆఫర్‌ను పెట్టడం ఏంటని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హిందీ వెర్షన్‌కు మాత్రమే…
అయితే ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ కేవలం హిందీ వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తుందట. అదికూడా నార్త్‌లో సినిమాను చూసేవారికి మాత్రమే ఓ టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆఫర్ అమలులో లేదని, అంతే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్స్‌కు వర్తించదని చెప్పారు. హిందీ వెర్షన్‌ను ప్రేక్షకులకు చేరువ చేయడానికే బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. నార్త్‌లో మిరాయ్‌కి అనుకున్న స్థాయిలో ఆదరణ లేకపోవడంతో ఆడియెన్స్‌కు థియేటర్లను రప్పించడానికి ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. హిందీలో మిరాయ్ మూవీని కరణ్ జోహార్ రిలీజ్ చేశారు.
మంచు మనోజ్ విలన్…
మిరాయ్ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించింది. స్టోరీతో పాటు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయంటూ మిరాయ్ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తేజ సజ్జా, మంచు మనోజ్ యాక్టింగ్‌లో అదరగొట్టారని అంటున్నారు. మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ సినిమాలో శ్రియా, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. మిరాయ్ మూవీకి పార్ట్ 2ను తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన మూవీ ఇది.


