Malayalam actress Shwetha Menon: ప్రముఖ మలయాళ నటి శ్వేతా మేనన్‌పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. శ్వేతా నటించిన కొన్ని సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ కావడంతో మార్టిన్ కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదును మొదట పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. శ్వేతా డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మార్టిన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. విచారణ చేసిన కోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/actress-rashmika-mandanna-new-look-as-political-leader/
ఎన్నికల సమయంలో వివాదం
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి శ్వేతా మేనన్ పోటీ చేయాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. 1994లో ‘ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్’ టైటిల్ గెలుచుకున్న శ్వేతా, తన తొలి చిత్రం ‘అనస్వరం’తో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘రతి నిర్వేదం’, ‘100 డిగ్రీ సెల్సియస్’ వంటి మలయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో ‘ఆనందం’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో, అలాగే ‘జూనియర్స్’, ‘రాజన్న’ వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.


