Saturday, July 6, 2024
Homeచిత్ర ప్రభCBN covert in Janasena is Pawan tweets Varma: జనసేనలో బాబు కోవర్ట్ పవనేనట!...

CBN covert in Janasena is Pawan tweets Varma: జనసేనలో బాబు కోవర్ట్ పవనేనట! పవన్ ను ఒకటే ఏడిపిస్తున్న వర్మ

వర్మ 'వ్యూహం' సూపర్ అంటున్న ఫాలోవర్స్

పాపం పవన్ కల్యాణ్ కు రోజులు బాలేవు. పవన్ కంటే బర్రెలక్క బెటర్ అని ఈరోజు సీఎం జగన్ అన్నారో లేదో అదప్పుడే వైరల్ అయిపోయింది. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ వంటి ముద్దుపేర్లు ఇప్పటికే జనాల్లోకి విస్తృతంగా వెళ్లగా సరికొత్త విమర్శ ఒకటి ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఈసారి ఈపేరు పెట్టింది మాత్రం వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు, పర్సనల్ లైఫ్, రాజకీయాలపై తెగ సెటైర్లు వేస్తుంటారు.

- Advertisement -

తాజాగా పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టైల్ పై మరో పంచ్ విసిరిన రాంగోపాల్ వర్మ.. జనసేనలో చంద్రబాబు కోవర్ట్ అంటూ ఉంటే అది ఇంకెవరో కాదు పవన్ కల్యాణ్ అంటూ ట్వీటారు. దెబ్బకు జనసైనికులు విలవిలలాడుతున్నారు.

ఓవైపు ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాలపై హాట్ హాట్ పొలిటికల్ స్టోరీతో ‘వ్యూహం’ అంటూ తెరపై సందడి చేసేందుకు రెడీ అయిన వర్మ ఇప్పుడు తన ‘వ్యూహం’ సినిమా కోసం ఇలా సరికొత్త వ్యూహంతో పవన్ పై మాటల దాడికి మరింత పదును పెట్టారు. ఏదేమైనా భలే నవ్వుతెప్పించే పొలిటికల్ సెటైర్ వేసారు వర్మ అంటూ కొందరు నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News