Sunny Sanskari ki Tulsi Kumari: బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ జోరు మామూలుగా లేదు. వారానికో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన హోమ్‌బౌండ్ మూవీ గత వారం రిలీజైంది. ఈ వీక్ దసరా బరిలో జాన్వీ మరో సినిమా సన్నీ సంస్కారి కీ తులసి కుమారి నిలిచింది. వారం గ్యాప్‌లో జాన్వీ కపూర్ రెండు సినిమాలు రిలీజ్ కావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వరుణ్ ధావన్ హీరో…
సన్నీ సంస్కారి కీ తులసి కుమారి మూవీకి రిలీజ్‌కు ముందు సెన్సార్ బోర్డ్ గట్టి షాక్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. జాన్వీ కపూర్‌తో పాటు సన్యా మల్హోత్రా మరో హీరోయిన్‌గా నటించింది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు.
లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో జాన్వీ హిట్టు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ రిలీజ్‌కు ముందు సినిమాకు సెన్సార్ బోర్డ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి మూవీలోని లిప్‌లాక్‌లను అరవై శాతానికిపైగా సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. చాలా రొమాంటిక్ డైలాగ్స్‌ను కూడా మ్యూట్ చేసిందట. సినిమాలో నాయకానాయికల కెమిస్ట్రీకి లిప్‌లాక్‌లే హైలైట్‌గా ఉండనున్నాయట. వాటికే సెన్సార్ బోర్డు కత్తెర వేయడంతో మేకర్స్ కూడా డైలమాలో పడ్డట్టు సమాచారం. సెన్సార్ ఎఫెక్ట్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి సినిమా రిజల్ట్‌పై గట్టిగానే ప్రభావం చూపించవచ్చని టాక్ వినిపిస్తోంది.
Also Read – Dasara: దసరా రోజున జమ్మి చెట్టుని ఎలా పూజిస్తే మంచిదంటే..!
రివీజన్ కమిటీ…
సెన్సార్ కట్ చేసిన సీన్ల వల్ల సినిమా స్టోరీ ఫ్లోనే మొత్తం మారిపోయిందని మేకర్స్ ఆరోపిస్తున్నారు. రొమాంటిక్ సినిమాల సెన్సార్ విషయంలో బోర్డు తీరు మారాలంటూ పేర్కొన్నారు. సెన్సార్ కట్స్‌పై రివీజన్ కమిటీకి వెళ్లాలని మేకర్స్ అనుకున్నారట. కానీ రిలీజ్‌కు మరో రోజు మాత్రమే టైమ్ ఉండటంతో అవకాశం లేకుండా పోయింది. దాంతో సెన్సార్ కట్స్‌తోనే గురువారం సన్నీ సంస్కారి కీ తులసి కుమారి సినిమా రిలీజ్ కాబోతుంది.
తెలుగులో రెండు సినిమాలు…
ప్రస్తుతం జాన్వీకపూర్ తెలుగులో పెద్ది సినిమా చేస్తోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 మార్చి 27న రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో జాన్వీ ఓ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read – Health: ఈ రెండు పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పండు ఏది?


