Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభChagalamarri: షార్ట్ ఫిలిం 'సెలా' షూటింగ్ సందడి

Chagalamarri: షార్ట్ ఫిలిం ‘సెలా’ షూటింగ్ సందడి

షార్ట్ ఫిలిం సందడి సూపర్ గా ఉందిగా

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో గొడిగనురు గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు లఘు చిత్రం ద్వారా తన డైరెక్షన్ రూపంలో తెరకెక్కుతోంది చిత్రం ” సెలా “. ఈ లఘు చిత్రంలో నటులంతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అని డైరెక్టర్ కిషోర్ తెలిపారు. ఈ చిత్రం విభిన్న కథగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలోని టీజర్ విడుదల చేశారు. కిషోర్ 3 లఘు చిత్రాలకు కెమెరామెన్ గా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుకుంటూ పరిచయం అయ్యారు. రానున్న రోజుల్లో దర్శకత్వం రూపంలో పరిచయం అవుతున్నారు. ఇంకా కొంచెం షూటింగ్ మిగిలి ఉందని, త్వరలోనే ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలోని నటీనటులు పవన్ సాయినాథ్ రెడ్డి , నవీన్ , సుధీర్ , వినోద్ , చిన్న పీరయ్య , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , చక్రి , తదితరులు నటిస్తున్నారు . ఈ చిత్రం గురుంచిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News