CHAMPION: శ్రీకాంత్ తనయుడు, యువ హీరో రోషన్. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చేస్తున్న సినిమా ‘ఛాంపియన్’. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన సరికొత్త అప్డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ‘ఛాంపియన్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.
విడుదల పోస్టర్‌లో రోషన్… కోటు, హ్యాట్‌తో విమానం దిగుతూ ఎంతో చార్మింగ్‌గా కనిపించడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రోషన్ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్డ్ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-sandeep-vanga-spirit-movie-villan/
నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
‘మహానటి’, ‘సీతారామం’ వంటి అద్భుతమైన చిత్రాలు అందించిన స్వప్న సినిమాస్ బృందం ఈ ‘ఛాంపియన్’ను నిర్మిస్తుండటం సినిమా పై
అంచనాలు మరింత పెంచుతోంది. పండుగ సీజన్‌లో భారీ అంచనాల మధ్య ఈ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ బరిలోకి దిగనుంది. ఈ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ నటి అనస్వర రాజన్.. ‘చంద్రకళ’ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తోంది టాలీవుడ్‌లో మెలోడీలకు మారుపేరైన మిక్కీ జె. మేయర్.
View this post on Instagram
‘నిర్మలా కాన్వెంట్’లో రోషన్ డెబ్యూ హీరోగా ఎంత క్యూట్‌గా కనిపించాడో, ‘ఛాంపియన్’ గ్లింప్స్‌లో అంతకుమించి ఇంటెన్స్‌గా, మాస్‌గా కనిపించాడు. మొదటి సినిమాలో రొమాంటిక్ బాల్‌తో ఆడుకున్న రోషన్, ఇప్పుడు ఫుట్‌బాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని మైదానంలో పరుగు పెడుతున్నాడు. దాదాపు పెళ్లి సందడి తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని, ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు రోషన్.
ప్రస్తుతం శరవేగంగా ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ ‘ఛాంపియన్’ డిసెంబర్ 25న ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


