Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభCheryala: చుంచనకోటలో 'బలగం' ప్రదర్శన

Cheryala: చుంచనకోటలో ‘బలగం’ ప్రదర్శన

కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తంగా ఇటీవల తీసిన బలగం సినిమాను చేర్యాల మండల పరిధిలోని చుంచనకోట గ్రామంలో ప్రదర్శించారు.  ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని బస్టాండ్ వద్ద ప్రదర్శించారు. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఈ సినిమాను తిలకించారు. గతంలో వీధి నాటకాలు, ఒగ్గు కథలు చూసేందుకు ఎలా వచ్చారో బలగం సినిమాను చూడడానికి అంతకన్నా ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు. సినిమాలో కుటుంబ పెద్దాయన చనిపోయినప్పుడు కుటుంబ కలహాలపై పాడిన పాట ప్రజల ఆత్మీయతను కదిలించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News