చేవెళ్ళ మండల కేంద్రంలో బలగం చిత్రం ప్రదర్శించారు. గ్రామ సర్పంచ్ పిఏసి ఎస్ చైర్మన్ సహకారంతో ఈ సినిమా ప్రదర్శించారు. కాలనీ వాసులు చిన్నా పెద్ద తెడలేకుండా సినిమాను వీక్షించారు. కాలనీ వాసులతో పాటు గ్రామ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి దేవర వెంకట్ రెడ్డి విక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కుటుంబ నేపథ్యం బంధు బలగం చిన్న చిన్న మనస్పర్థాలు ఉమ్మడి కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలు పంచే చిత్రం అన్నారు. ఈ చిత్రాన్ని గ్రామంలోని అంగడిబాజర్ కాలనీలలో ప్రదర్శిస్తామన్నారు.
ప్రస్తుత సమాజంలో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయన్నారు. చిన్న చిన్న మనస్పార్థాలతో రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు దూరమవుతున్నారన్నారు. అమ్మ నాన్న ఆడపడుచులు అన్నదమ్ములు బంధు బలగం ఒక చావు కార్యక్రమంలో ఒక్కటైనా విధానం చూసైనా గ్రామాల్లో కుటుంబాలు ఏకం కావాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కుటుంబ నేపథ్యాన్ని చెప్పే ఈ చిత్రానికి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. బలగం సినిమాను సిపిఐ కాలనీవాసులు సుమారు 250నుండి 300 మంది వీక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ గంగి యాదయ్య ఎంపీటీసీ గుండాల రాములు సిపిఐ నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.