ఛావా (అంటే పులి పిల్ల అని అర్థం) సినిమా కలెక్షన్స్ 200 కోట్లు దాటింది. సినిమా రిలీజ్ అయి 5 రోజుల తరువాత కూడా బాక్సాఫీస్ లో హాట్ కేక్స్ లా టికెట్స్ సేల్ అవుతున్నాయి. స్కూల్, కాలేజ్ పిల్లలు అంతా తమ సంస్థల తరపున వచ్చి సినిమా చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఛావా మాటే వినిపిస్తుండగా సినిమా మౌత్ టు మౌత్ టాక్ ద్వారా సూపర్ హిట్ అయి కూర్చుంది.
తెలుగులో తీస్తారా?
మరాఠీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో తీసినా ఆశ్చర్యపోనవసరం లేనంతగా ఈ సినిమా తెలుగువారిని సైతం ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం దుమ్ములేపేలా ఉందని సెలబ్రిటిలీ, సినిమా క్రిటిక్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ మనువడి గురించి ఇంత మంచి కథ మేమెప్పుడూ వినలేదు, చదవలేదంటూ సెలబ్స్ ట్వీట్ చేస్తుండగా సోషల్ మీడియా అంతా ఛావాపైనే చర్చ సాగేలా చేస్తోంది.
సర్వం ఒడ్డిన విక్కీ
శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ సర్వం ఒడ్డి నటించిన తీరు సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా అందరినీ మెప్పించేలా నటించాడు. మహారాణిగా రష్మిక మందన్న కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టగా, వీలైనంతవరకు గ్రాఫిక్స్, డూపులు లేకుండా ఈ సినిమా తెరకెక్కించటం హైలైట్.