Saturday, April 12, 2025
Homeచిత్ర ప్రభChhaava Movie: ఓటీటీలోకి 'ఛావా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Chhaava Movie: ఓటీటీలోకి ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఛావా'(Chhaava). ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు ‘శంభాజీ మహరాజ్’ పాత్రలో జీవించాడు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆయన భార్య పాత్రలో అలరించింది.

- Advertisement -

బాక్సాఫీస్ వ‌ద్ద కాసులవ‌ర్షం కురిపించింది. కేవ‌లం హిందీలోనే రూ.800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్ట‌డం విశేషం. ఈ సినిమాను మార్చి 7న గీతా ఆర్ట్స్ ‌సంస్థ తెలుగులో విడుద‌ల చేయ‌గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేర‌కు నెట్‌ఫ్లిక్స్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News