Wednesday, February 26, 2025
Homeచిత్ర ప్రభChhaava: తెలుగులో ‘ఛావా’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

Chhaava: తెలుగులో ‘ఛావా’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఛావా'(Chhaava). బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు ముహుర్తం ఖరారైంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దక్కించుకుంది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

- Advertisement -

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితాధారంగా రూపొందిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమాలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్‌ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హిందీ వెర్షన్‌లో చూసి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో తెలుగులోనూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు వారి కోరిక మార్చి 7 నుంచి నెరవేరనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News