చిగురుమామిడి మండల కేంద్రములో జెండా చౌరస్తా (సర్వాయి పాపన్న విగ్రహం) వద్ద బలగం సినిమా ప్రదర్శనకు గ్రామం నుండి అశేష జనం విచ్చేసి ఉత్సహంగా సినిమా చూశారు. తెలంగాణ పల్లె జీవనానికి అద్దం పట్టే విధంగా, కుటుంబ బంధాలు, బంధుత్వాలు మీద భావోద్వేగమైన సినిమా చివర్లో ప్రేక్షకులందరూ కన్నీటి పర్యాంతమయ్యారు.
మహిళా ప్రేక్షకుల నుండి లక్కీ డీప్ ద్వారా నలుగురు గాజుల శారద (ప్రథమ), శిరవేణి మమత (ద్వితీయ), దూల శారద (తృతీయ), మిర్యాల సుమిత్ర (కన్సోలేషన్) లకు చీరలు పంపిణి చేశారు. సినిమా ప్రధాన పాత్ర గాజుల కొమురయ్య కావడం, ప్రథమ బహుమతి గాజుల శారదకు యాదృచ్ఛికం. ఉత్తమ కుటుంబ విలువలు గల సినిమా చూపించినందుకు జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ స్థానికులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమములో జడ్పీటీసీ గీకురు రవీందర్ తో పాటు రైతు బంధు జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత, మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమా చారి, బుర్ర శ్రీనివాస్, బెజ్జంకి అంజయ్య, పెసరి శ్రీనివాస్, పోటు మల్లారెడ్డి, బుర్ర తిరుపతి, రాకం అంజవ్వ, డా.పెనుకుల తిరుపతి, రాకం అనిల్, చిట్టెల కృష్ణ, ఎడ్ల అంజయ్య, బొలుమల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.