Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPeddi: 'చికిరి చికిరి' సాంగ్ అప్డేట్.. రెహమాన్ మ్యూజిక్, చరణ్ డాన్స్!

Peddi: ‘చికిరి చికిరి’ సాంగ్ అప్డేట్.. రెహమాన్ మ్యూజిక్, చరణ్ డాన్స్!

Peddi: రామ్ చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ లోంచి ఫస్ట్ సాంగ్ ‘చికిరి చికిరి’ త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ సాంగ్ ప్రమోషన్స్‌ ఆల్రెడీ స్టార్ట్ చేసిన బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ ప్రమోషన్స్‌ టైం లో దేవిశ్రీ ప్రసాద్‌కి సాంగ్ గురించి చెప్పినట్టు, ఇప్పుడు ఏ.ఆర్. రెహమాన్ కి పెద్ది సాంగ్ గురించి చెప్తున్నట్టు వీడియో రిలీజ్ చేసాడు. రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు కాబట్టి, సాంగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

- Advertisement -

ALSO READ: Raviteja: వరుసగా ఐదు ప్లాప్‌లు, “ఇలా అయితే కష్టం” అంటున్న ఫ్యాన్స్!

‘చికిరి’ కథేంటి?

బుచ్చిబాబు ఈ సాంగ్ ఎలా పుట్టిందో రెహమాన్ కి వివరిస్తూ, హీరో కొండల్లో ఉంటాడు, ఊర్లో ఉన్న హీరోయిన్‌ను చూసి, “కాటుక, ముక్కుపుడక అవసరం లేని అరుదైన చికిరి ఈ చికిరి” అని ఫ్రెండ్‌తో అంటాడు. ఆ ప్రాంతంలో అందమైన అమ్మాయిలను ‘చికిరి’ అని పిలుస్తారు అని చెప్పాడు. ఆ పదం రెహమాన్‌కు బాగా నచ్చి, అదే పాట పేరుగా పెట్టారు. ఈ సాంగ్ ని మూవీ టీం ముందుగా అనౌన్స్ చేసిన విధంగా మోహిత్ చౌహాన్ పాడనున్నాడు.

ALSO READ: Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమా సంగీత దర్శకుడతనేనా..? బన్నీ లీక్‌లో ఏముంది?

చరణ్ స్టెప్స్ అదుర్స్!

‘చికిరి చికిరి’ వీడియో చివర్లో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతోంది. మాస్ లుక్‌లో చరణ్ వేసిన స్టెప్ చూస్తుంటే, ఈ పాట బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. ‘ఉప్పెన’ సాంగ్స్ అన్ని ఎంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే. ఈసారి బుచ్చిబాబు, రెహమాన్ కాంబినేషన్‌ మీద కూడా ఆడియన్స్ లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సాంగ్‌ను నవంబర్ 7న రెహమాన్ కాన్సర్ట్లో రిలీజ్ చేయొచ్చని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad