Dussehra 2025: ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు లాంఛ్ కావడం అన్నది అరుదు. అలాంటి అరుదైన సంఘటనకు ఈ దసరా వేదిక కాబోతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విజయదశమి రోజున ప్రారంభం కాబోతున్నాయి.
చిరంజీవి – బాబీ మూవీ…
వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఇటీవల చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న 158వ మూవీ. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం.
Also Read – Anushka Shetty: ఘాటీ డిజాస్టర్ ఎఫెక్ట్ – సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన అనుష్క
హైదరాబాద్‌లో ఈవెంట్…
చిరంజీవి, బాబీ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం. ఓపెనింగ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో భారీగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొనున్నట్లు సమాచారం. అదే రోజు సినిమా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుండగా, విశ్వంభర వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వీరసింహారెడ్డి తర్వాత…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సెకండ్ టైమ్ సినిమా చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 111వ సినిమా ఇది. రామ్‌చరణ్‌తో పెద్ది సినిమాను నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు ఎన్‌బీకే 111కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్లుగా మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
Also Read – Samyuktha Menon: ఏడాది పాటు ఒక్కటీ లేదు.. కట్ చేస్తే చేతిలో 8 సినిమాలు.. ఆ లక్కీ బ్యూటీ ఎవరో తెలుసా?
దసరా రోజున…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా కూడా దసరా రోజునే గ్రాండ్‌గా లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అఖండ 2 విడుదలకానున్నట్లు బాలకృష్ణ స్వయంగా ప్రకటించాడు.


