గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఇతర నటులు, దర్శకులు, నిర్మాతలు చరణ్‌కు ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ (Peddi) ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని చిరు ట్వీట్ చేశారు.
‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నమ్ముతున్నా’’ అని పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ అయితే నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అని ఆకాంక్షించారు.
చరణ్ బావమరిది సాయి దుర్గా తేజ్ అయితే తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు..తీసుకో బావ నా ఈ బండ ప్రేమను” అని ట్వీట్ చేశారు.