మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం కథను దాదాపుగా పూర్తి చేసిన అనిల్, ప్రస్తుతం తారాగణం ఎంపికపై దృష్టి సారించారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం పలు పేర్లు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఒక్క పాట బ్యాలెన్స్ ఉందంతే. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు చిరు. సమ్మర్ తర్వాత ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితి రావు హైదరీ పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్‌ను అలాగే తీసుకున్నారు. గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేసారు. తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు అనిల్. ఓ సీనియర్ హీరోయిన్.. ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం అంజలి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. గతంలో వెంకటేష్, రామ్ చరణ్ లతో కలిసి నటించిన అనుభవం అంజలికి ఉండటం విశేషం. అంతేకాకుండా రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయనకు తల్లి పాత్రలో కూడా ఆమె కనిపించనుంది. మరి చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని అంజలి అందిపుడుచుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.