తెలుగు చిత్రసీమలో మరో వినోదాత్మక చిత్రానికి తెరలేచింది. మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, నాగబాబు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా వెంకటేష్ పాల్గొని చిరంజీవి పాత్రకు క్లాప్ కొట్టారు. అనిల్ రావిపూడి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా చిరంజీవి క్యారెక్టర్ పేరు శంకర్ వరప్రసాద్ అని, సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని వెల్లడించారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి, మెగాస్టార్, అనిల్ రావిపూడి కామెడీ కాంబినేషన్ అంటూ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.