Nagarjuna Akkineni: ఒకే సినిమాలో అన్ని భాషలకు చెందిన పాన్ ఇండియన్ స్టార్స్ నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కూలీతో ఫస్ట్ టైమ్ ఆ థ్రిల్‌ను అభిమానులకు అందించబోతున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో స్టార్ హీరోలు ఆమిర్‌ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆగస్ట్ 14న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది.
నాగార్జున విలన్…
కూలీ మూవీలో నాగార్జున విలన్ నటిస్తున్నాడు. సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. రజనీకాంత్‌కు ధీటుగా అతడి క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. కూలీలో నాగార్జున లుక్‌కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read – Ntr – Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ డామినేషన్.. కింగ్డమ్ దాటేసిన వార్ 2
బాక్సాఫీస్ డిజాస్టర్స్…
రజనీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరోలు విలన్స్‌గా నటించడం ఇదే మొదటిసారి కాదు. రజనీకాంత్ హీరోగా నటించిన కాళీ, బందిపోటు సింహం సినిమాల్లో చిరంజీవి విలన్‌గా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలవడం గమనార్హం.
కాళీ మూవీ 1980లో రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీకి ఐవీ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవి మెయిన్ విలన్‌గా నటించాడు. కాళీ సినిమా సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడంతో కొందరు ఫైటర్లతో పాటు గుర్రాలు చనిపోయాయి. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదం కూడా సినిమా ఫెయిల్యూర్‌కు ఓ కారణంగా నిలిచింది.
బందిపోటు సింహం…
ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా 1981లో వచ్చిన బందిపోటు సింహం సినిమాలో చిరంజీవి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేశాడు. గాజు కన్నుతో భయంకరమైన విలన్‌గా చిరంజీవిని ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ ఎస్‌పీ ముత్తురామన్. విలన్‌గా చిరంజీవి క్యారెక్టర్ ఫేమస్ అయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కెరీర్ ఆరంభంలో చిరంజీవి విలన్‌గా చేసిన ఈ రెండు సినిమాలు అంతగా ఆడలేదు.
Also Read – Health News: కుక్కర్‌లో వండి తింటున్నారా? ఇక ఒళ్లంతా విషమే!!
యాక్షన్ ఎపిసోడ్‌లో…
కాళీ, బందిపోటు సింహం సినిమాల్లో విలన్‌గా నటించిన చిరంజీవి…లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రజనీకాంత్ మాప్పిళ్లైలో నటించాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో నటించి అభిమానులను అలరించాడు. మాప్పిళ్లై మూవీ చిరంజీవి హీరోగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు రీమేక్ కావడం గమనార్హం.


