Chiranjeevi: కొన్ని రోజుల క్రితం, తన పేరును, ఫొటోలను కొందరు వ్యాపారాలకు వాడుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కూడా వెంటనే స్పందించింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ వాణిజ్య ప్రకటనలకు వాడకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఈ కోర్టు తీర్పుతో, చిరంజీవి పేరును వాడుకుంటున్న దాదాపు 60 మందికి నోటీసులు వెళ్లాయి. ఆ నోటీసులు అందుకున్న వాటిలో ఒకటి నల్లగండ్ల రోడ్డు పక్కన ఉన్న ‘చిరంజీవి ధాబా’. అయితే, చిరంజీవి టీమ్‌ను ధాబా యజమాని రవి తేజ్ సంప్రదించడం, ఆ తర్వాత చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Pradeep Ranganadhan: ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
కోర్టు నోటీసులు అందిన తర్వాత, ఆ ‘చిరంజీవి ధాబా’ ఓనర్ మీడియాకు, అలాగే చిరంజీవి టీమ్‌కు ఒక విషయం చెప్పాడు. “చిరంజీవి అంటే తమకు చాలా ఇష్టం, పెద్ద అభిమానిని కాబట్టే ఈ ధాబాకు ఆయన పేరు పెట్టుకున్నాను. ధాబా మొత్తం చిరంజీవి ఫొటోలతో నింపాను. దీని వెనుక మాకు వేరే ఉద్దేశం లేదు” అని వివరించాడు. తమ ధాబా వల్ల చిరంజీవి పేరుకు ఎలాంటి చెడు జరగడం లేదని, ప్రేమతోనే పేరు పెట్టామని వారు చిరంజీవి టీమ్‌కు తెలియజేసాడు. సాధారణంగా అభిమానుల విషయంలో చిరంజీవి ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు.
ASLO READ: Premante: ప్రియదర్శి ‘ప్రేమంటే’ టీజర్.. మళ్లీ ఒక మంచి హిట్ పడేలా ఉంది!
ధాబా ఓనర్ ఇచ్చిన వివరణ, వారి అభిమానం చూసిన చిరంజీవి.. ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ధాబా వల్ల తన పేరుకు ఎలాంటి నష్టం లేదు, అలాగే తన పేరును తప్పుగా వాడుకోవడం లేదు అని తెలుసుకుని. అభిమానంతో పెట్టుకున్న ఆ ధాబా పేరును అలాగే ఉంచుకోవడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ విషయం అంతా ధాబా ఓనర్ ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మొత్తానికి, కోర్టు వరకు వెళ్లిన ఈ చిన్న వివాదం.. చిరంజీవి అభిమానం కారణంగా సాఫీగా ముగిసింది.


