Spirit Movie: ప్రభాస్ హీరోగా యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇన్నాళ్లుగా ఇదొక కాప్ డ్రామా మూవీ అని, ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా స్పిరిట్ సినిమాను మిస్టరీ సూపర్ నాచురల్ థ్రిల్లర్ జానర్‌లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
స్పిరిట్‌లో చిరంజీవి…
అంతే కాకుండా ప్రభాస్ స్పిరిట్‌లో చిరంజీవి నటించబోతున్నట్లు కొత్త పుకారు మొదలైంది. ఇందులో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ కనిపిస్తారని వార్తలొచ్చాయి. యానిమల్‌లో అనిల్ కపూర్ పాత్రను పోలి స్పిరిట్‌లో చిరంజీవి రోల్ సాగుతుందంటూ రూమర్ వినిపించింది. గెస్ట్ రోల్ అయినా కథకు చాలా కీలకంగా నిలిచే క్యారెక్టర్ కావడంతో చిరంజీవి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారంటూ వార్తలొచ్చాయి.
టైమ్‌పాస్ రూమర్…
ఈ పుకార్లపై చిరంజీవి పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్పిరిట్‌లో చిరంజీవి నటిస్తున్నారన్నది ఫేక్ న్యూస్ అని చెప్పింది. కావాలనే క్రియేట్ చేసిన టైమ్‌పాస్ రూమర్ అంటూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ ట్వీట్‌లో స్పిరిట్ సినిమాతో పాటు ప్రభాస్ పేరును మెగా టీమ్ ఎక్కడ ప్రస్తావించలేదు. ఇన్‌డైరెక్ట్‌గానే ఈ పుకార్లను కొట్టిపడేసింది.
Also Read – Today TG Rains: రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు..!
డిసెంబర్‌లో మొదలు…
కాగా స్పిరిట్ షూటింగ్ సెప్టెంబర్‌లోనే మొదలు కానున్నట్లు వార్తలొచ్చాయి. అయితే రాజాసాబ్‌తో పాటు ఫౌజీ షూటింగ్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ షూటింగ్ అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి కానుంది. ఆ తర్వాతే స్పిరిట్‌పై ఫోకస్ పెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో స్పిరిట్ సెట్స్‌పైకి రానున్నట్లు చెబుతున్నారు.
త్రిప్తి డిమ్రి…
స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్‌తోనే త్రిప్తి డిమ్రి ఫేమస్ అయ్యింది. తొలుత స్పిరిట్‌లో హీరోయిన్‌గా దీపికా పదుకోణ్ పేరు గట్టిగానే వినిపించింది. కానీ డైరెక్టర్‌తో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ సినిమా నుంచి దీపికా తప్పుకుంది. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేశాడు. ఇందులో కొరియన్ యాక్టర్ డాన్‌లీ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్పిరిట్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ అయ్యాయట. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Vastu: కొత్త పర్సు కొన్నాక..పాత పర్సు పడేస్తున్నారా..అయితే ఇది మీకోసమే!


