Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మన శంకర వరప్రసాద్‌గారు సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో మరో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ ఇదే.
కాగా, ఈ సినిమా నుంచి ఇటీవలే మీసాల పిల్ల పేరుతో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో నలభై మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. మీసాల పిల్ల సాంగ్‌తో లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వింటేజ్ ఫీల్‌ను కలిగిస్తూ సాగిన ఈ పాటలో ఉదిత్ నారాయణ్ వాయిస్‌తో పాటు లిరిక్స్, చిరు, నయనతార కెమిస్ట్రీ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
మీసాల పిల్ల తర్వాత సెకండ్ సింగిల్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ సింగర్‌ను రంగంలోకి దించబోతున్నారట. మన శంకర వరప్రసాద్‌గారు సెకండ్ సింగిల్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడబోతున్నారట. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో రమణ గోగుల పాడిన గోదారి గట్టు మీద సాంగ్ పెద్ద హిట్టయ్యింది. అలాంటిదే ఫోక్ స్టైల్‌లో సాగే ఓ సాంగ్ మన శంకర వరప్రసాద్‌గారులో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ పాటను రమణ గోగుల ఆలపించబోతున్నారట. నవంబర్ మూడో వారంలో సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మన శంకర వరప్రసాద్‌గారు షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, వెంకటేష్, నయనతారలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి. త్వరలోనే చిరంజీవి, వెంకటేష్‌లపై ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు సమాచారం.
మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు విశ్వంభర, శ్రీకాంత్ ఓదెల, డైరెక్టర్ బాబీలతో సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి. ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ – కిషోర్ తిరుమల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.


