Mega Brothers: మెగా హీరోలందరూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. చిరంజీవి మూడు సినిమాలు చేస్తుండగా… పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌తో పాటు మిగిలిన మెగా హీరోలందరి ఒక్కో సినిమా సెట్స్ పై ఉంది. తాజాగా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్స్ రివీలయ్యాయి. చిరంజీవి సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి మొదలవ్వగా…శనివారం నుంచి ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌లో రీ జాయిన్ కాబోతున్నడు పవన్. ఈ రెండు సినిమాలకు సంబంధించి సాంగ్ షూట్స్ జరుగనున్నాయి.
విజవల్ ట్రీట్…
చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యాభై శాతానికిపైనే షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం నుండి మొదలైంది. ఈ నెల 19 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సంక్రాంతికి తెలుగు ఆడియెన్స్‌కు విజువల్ ట్రీట్‌గా మన శంకర వరప్రసాద్ గారు ఉండబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మన శంకర వరప్రసాద్ గారులో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అక్టోబర్‌లో మొదలయ్యే నెక్స్ట్ షెడ్యూల్‌లో వెంకటేష్ ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు ఇటీవల నిర్మాత సాహు గారపాటి ప్రకటించారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న 157వ మూవీ ఇది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది.
Also Read – Ganesh immersion: నగరవాసులకు మెట్రో శుభవార్త… ఒంటి గంట వరకు సేవలు
మాస్ సాంగ్….
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ శనివారం నుంచి మొదలుకాబోతుంది. హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌పై మాస్ ఎనర్జిటిక్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నాడు. ఈ పాటలో పవన్ స్టెప్పులు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచుల నిర్వహణ..!


