Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తాజాగా ఊరట లభించింది. ఇకపై ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, (మెగాస్టార్, చిరు, అన్నయ్య, బాస్ వంటివి) వాయిస్, వాణిజ్యపరంగా లేదా ఇతరత్రా ఉపయోగించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది. అనధికారికంగా ఆయన ఇమేజ్‌ని వాడితే జైలు శిక్షతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చిరంజీవి పేరును, ఫొటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/sandeep-reddy-vanga-magic-spirit-movie/
అసలు విషయం ఏమిటి?
చిరంజీవి తన పేరు, ఫోటోలు, పలు ఆన్‌లైన్ సంస్థలు, ఈ కామర్స్ స్టోర్లు, యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు తన అనుమతి లేకుండా వాడుతున్నాయని, దీని వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా కొన్ని సంస్థలు ఆయన ఫోటోలు (AI) ద్వారా సృష్టించిన ఫోటోలను ఉపయోగించి టీ-షర్టులు, పోస్టర్లు వంటి వస్తువులను అమ్ముతున్నాయని, తద్వారా సొమ్ము చేసుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/taapsee-pannu-good-bye-to-movies/
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఏ వ్యక్తి, సంస్థ (ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు ఉంది) చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్, , ఆయన గుర్తింపును వాణిజ్య ప్రకటనల్లో కానీ, ఇతర ప్రయోజనాల కోసం కానీ ఉపయోగించకూడదు.
ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కిందకు వస్తుంది, దీనికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. చిరంజీవి కీర్తి, గుర్తింపు సాటిలేనిదని, ఆయన పేరును దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాన్ని డబ్బుతో కూడా వెలకట్టలేమని కోర్టు పేర్కొంది.


