Rowdy Alludu Movie: 1990 దశకాన్ని చిరంజీవి కెరీర్‌లో గోల్డెన్ పీరియడ్‌గా అభిమానులు చెబుతుంటారు. ఆ టైమ్‌లో చిరంజీవి హీరోగా నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తూ వచ్చాయి. వాటిలో రౌడీ అల్లుడు ఒకటి. చిరంజీవి కెరీర్‌లో మంచి మాస్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రౌడీ అల్లుడు కంటే ముందు చిరంజీవి, కే రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి క్లాస్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ సక్సెస్‌తో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. జగదేకవీరుడు అతిలోక సుందరికి భిన్నంగా మంచి మాస్ కథతో రౌడీ అల్లుడు సినిమా చేయాలని కే రాఘవేంద్రరావు అనుకున్నారు.
Also Read – War 2: ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎపిక్ డిజాస్టర్ – బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2కు వచ్చిన నష్టాలు ఎంతంటే?
సాయిధరమ్‌తేజ్ తండ్రి…
శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ అనే నూతన నిర్మాణ సంస్థపై అల్లు అరవింద్, కే వెంకటేశ్వరరావు, పంజా ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కే వెంకటేశ్వరరావు చిరంజీవికి తోడల్లుడు అవుతాడు. పంజా ప్రసాద్ మెగా యంగ్ హీరోలు సాయిధరమ్‌తేజ్, పంజా వైష్ణవ్‌తేజ్‌ల తండ్రి. ఈ బ్యానర్‌లో వచ్చిన ఒకే ఒక మూవీ ఇదే. రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశాడు. కోటీశ్వరుడైన కళ్యాణ్‌గా క్లాస్ రోల్, ఆటో జానీ అనే మాస్ రోల్‌లో కనిపించారు. ఆటో జానీ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. రౌడీ అనే టైటిల్ పెడితే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందని అల్లు రామలింగయ్య సందేహించడంతో ఈ మూవీకి తొలుత ఆటోజానీ అనే పేరును పెట్టాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ కంటే రౌడీ అల్లుడు బాగుండటంతో అదే ఫైనల్ చేశారు. ఈ సినిమాలో బాక్స్ బద్దలైపోతుంది అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.
దివ్యభారతి హీరోయిన్…
రౌడీ అల్లుడు విజయంలో బప్పిలహరి మ్యూజిక్ కీలకంగా నిలిచింది. చిలుకా క్షేమమా, తద్దినకా తప్పదికా, అమలాపురం బుల్లోడా వంటి పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా దివ్యభారతి, శోభన హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి, దివ్యభారతి కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక తెలుగు మూవీ ఇదే.


