Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi: సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi: సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

తెలుగు ప్రజలందరికీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

- Advertisement -

“ముంగిళ్లలో అందమైన రంగవల్లులు.. లోగిళ్లలో ఆనందపు వెలుగులు.. జంగమ దేవరుల జేగంటలు.. హరిదాసుల కీర్తనలు.. భోగ భాగ్యాలు, సిరి సంపదలూ వెరసి అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లి విరియాలని ఆశిస్తూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరు సంప్రదాయ దస్తుల్లో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొని సందడి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News