Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభChiru- Venky: స్పెషల్‌ ఫ్లైట్‌లో అగ్ర హీరోలు.. 80’s రీయూనియన్‌కి చిరు, వెంకీ

Chiru- Venky: స్పెషల్‌ ఫ్లైట్‌లో అగ్ర హీరోలు.. 80’s రీయూనియన్‌కి చిరు, వెంకీ

Chiru- Venky 80’s Reunion:టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు పోటీ వచ్చినా మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ ఇప్పటికీ అగ్ర హీరోలే. యువ నటులతో పోటాపోటీగా నటిస్తూ ఇప్పటికీ థియేటర్లన్నీ హౌజ్‌ఫుల్‌ ఉండేలా వారి పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నారు. కామెడీ టైమింగ్‌, మేనరిజం, డాన్స్‌ పర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు వారిచ్చిన కిక్‌ అంతా ఇంతా కాదు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/jayashankarr-movie-ari-release-date-locked/

ఇక చిరు, వెంకీ సినిమాలకు ఎంత పోటీగా ఉన్నా.. బయట మాత్రం వారి ఫ్రెండ్‌షిప్‌కి సలాం కొట్టాల్సిందే. సాధారణంగా అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ వారు అలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే ఫ్యాన్స్‌కి ఇక పండగే. తాజాగా చిరు, వెంకీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ఫుల్‌ జోష్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/sriya-reddy-agree-to-act-in-salaar-og-sequels/

చిరు, వెంకీ స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ దిగిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఈ ఇద్దరు స్పెషల్ ఫ్లైట్‌లో ఎక్కడికెళ్తున్నారంటే.. చెన్నైలో జరుగనున్న 80’s యాక్టర్ల రీయూనియన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారట. ఈ సందర్భంగా వారిద్దరి ఫ్రెండ్‌షిప్‌ను ప్రతిబింబిస్తూ కెమెరాకు పోజులిచ్చారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు లైక్స్‌, షేర్స్‌ చేస్తున్నారు. కాగా, చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాలో వెంకటేశ్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారని.. ఆ పాత్ర కథను మలుపు తిప్పుతుందని చిత్ర బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad