మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, సూపర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి మూవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను పంచుకుంటూ మూవీ టీమ్ మెగా 157 అంటూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది.
ఈ వీడియోలో ఇప్పటి వరకూ చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న వర్క్‌ను వివరించారు. చివర్లో ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు చిరంజీవి, అనిల్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.