Friday, May 16, 2025
Homeచిత్ర ప్రభAlekhya Chitti: సినిమాల్లోకి అలేఖ్య చిట్టి.. ఏంటి షాక్ అయ్యారా..?

Alekhya Chitti: సినిమాల్లోకి అలేఖ్య చిట్టి.. ఏంటి షాక్ అయ్యారా..?

అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరును వింటేనే అందరికీ ఆడియో క్లిప్స్, ట్రోల్స్ గుర్తుకు వస్తాయి. ఈ పికిల్స్ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లింది అక్కచెల్లెళ్లు కలసి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న వీరు, ఓ దశలో కస్టమర్లతో జరిగిన వివాదాల కారణంగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి జోరుగా పచ్చళ్లు విక్రయిస్తున్నారు.

- Advertisement -

ఇవాళ ఈ బ్రాండ్ పేరు రమ్య చుట్టూ తిరుగుతోంది. రమ్య చేసిన రీల్స్, ప్రమోషన్ల వల్లే ఈ పికిల్స్ పేరు చాలా మందికి తెలిసింది. ఆమె గ్లామరస్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఫాలోవర్స్‌ను పెంచాయి. ఇప్పుడైతే ఆమెనే చిట్టి పికిల్స్ ముఖచిత్రంగా అందరూ భావిస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. తాజాగా రమ్య ఒక సినిమా టీజర్ ఈవెంట్‌లో మెరిసింది. హీరో అశ్విన్ బాబు నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ సినిమా టీజర్ లాంచ్‌లో రమ్య పాల్గొనడం తో, ఆమె సినిమా రంగంలోకి అడుగుపెడుతోందా.. అనే చర్చ నెట్టింట మొదలైంది. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగినది. సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు శైలేశ్ కొలను, నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ దామోదర్ ప్రసాద్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

రమ్య ప్రెజెన్స్ చూసిన నెటిజన్లు.. ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందా అంటూ మీమ్స్ చేస్తున్నారు. గతంలో చిన్న సినిమాల్లో నటించానని చెప్పిన ఆమె, ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై తన మెరిసేందుకు ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. మొత్తానికి చిట్టి పికిల్స్ అమ్మాయి ఇప్పుడు నిజంగానే సెలబ్రిటీగా మారిపోయిందనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News