Choreographer Sandy Master: సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు, ఎలా మారుతుందో ఊహించడం కష్టం. ప్రస్తుతం చాలా మంది యాక్టర్లు డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. తెర వెనుక తమ ప్రతిభతో సత్తా చాటుతున్న టెక్నీషియన్లు నటులుగా ఎంట్రీ ఇచ్చి సిల్వర్‌స్క్రీన్‌పై అదరగొడుతున్నారు. ఈ లిస్ట్‌లో కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ చేరారు. కోలీవుడ్‌లో విక్రమ్, కాలా, పెరియారుమ్ పెరుమాల్ సినిమాలతో డ్యాన్స్ మాస్టర్‌గా పాపులర్ అయ్యారు శాండీ మాస్టర్. అనుకోకుండా యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో సైకో తరహా విలన్ పాత్రలకు శాండీ మాస్టర్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. దళపతి విజయ్ లియోతో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మలయాళం మూవీ కొత్త లోకలో విలన్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు శాండీ మాస్టర్.
Also Read – Pm Modi Birthday: మోదీ బర్త్ డే విషెస్ లో వైరల్ అవుతోన్న ఒకప్పటి శ్రీనగర్ ఫోటో..!
కిష్కిందపురితో తెలుగులోకి ఎంట్రీ…
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కిందపురి మూవీతో యాక్టర్‌గా శాండీ మాస్టర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేశాడు. చీరకట్టులో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు శాండీ మాస్టర్. తన క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ పట్ల శాండీ మాస్టర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
“కిష్కిందపురి రిలీజ్ వరకు నా క్యారెక్టర్ ఏమిటి? లుక్ ఎలా ఉండబోతుంది అన్నది సీక్రెట్‌గా ఉంచారు మేకర్స్. సినిమాలో నన్ను, నా లుక్‌ను చూసి ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు” అని శాండీ మాస్టర్ పేర్కొన్నారు. “దళపతి విజయ్ లియో మూవీ యాక్టర్‌గా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమాలో సైకో పాత్ర కోసం లోకేష్ కనగరాజ్ నన్ను ఎంపికచేశారు. చిన్నతనంలో నా రూపాన్ని, కళ్లను చూసి అందరూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ కళ్లను చూసే లోకేష్ కనగరాజ్ లియో సినిమాలో యాక్టర్‌గా అవకాశం ఇచ్చారు. లియో వల్లే కిష్కిందపురితో పాటు చాలా సినిమాలు చేయగలిగా. లియో తర్వాత సైకో పాత్రలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఒకే టైమ్ రోల్స్ కావడంతో రిజెక్ట్ చేశా. కిష్కిందపురితో నటుడిగా నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం దొరికింది” అని అన్నారు శాండీ మాస్టర్. “చిన్నతనంలో వంద, నూటయాభై రూపాయలకు గుళ్లల్లో పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసేవాడిని. అక్కడి నుంచి నా కెరీర్ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో యాక్టింగ్, కొరియోగ్రఫీ రెండింటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతాను” అని శాండీ మాస్టర్ చెప్పారు.
Also Read – Mirai Movie: మిరాయ్ మూవీ మిస్ చేసుకున్న హీరో – మంచు మనోజ్ ప్లేస్‌లో విలన్‌గా అతడు నటించాల్సింది!
మలయాళంలో విలన్.. తమిళంలో హీరోగా..
ప్రస్తుతం మలయాళం చిత్రం కథనార్‌లో విలన్‌గా నటిస్తున్నాడు శాండీ మాస్టర్. పా రంజిత్ నిర్మిస్తున్న తమిళ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ప్రమోషనల్ సాంగ్‌కు శాండీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల రిలీజైన కూలీ మూవీలో మోనిక సాంగ్‌కు శాండీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.


