Monday, July 8, 2024
Homeచిత్ర ప్రభCinema: కశ్మీర్ ఫైల్స్ రీ-రిలీజ్, షారూఖ్ కు షాక్ తప్పదా?

Cinema: కశ్మీర్ ఫైల్స్ రీ-రిలీజ్, షారూఖ్ కు షాక్ తప్పదా?

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా రీ-రిలీజ్ చేస్తున్నారు. అదికూడా పఠాన్ సినిమా రిలీజ్ కు జస్ట్ ఓ 6 రోజులు ముందు కావటం విశేషం. జనవరి 19న కశ్మీర్ ఫైల్స్ రీ రిలీజ్ కానుంది. కశ్మీరీ పండితులు సొంత దేశంలో శరణార్థులుగా బతకాల్సి వచ్చి 33 సంవత్సరాలు కావచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను మళ్లీ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఈమేరకు సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో రిలీజ్ గురించిన విషయాలు వెల్లడించారు. కేవలం ఏడాది గ్యాప్ తో ఓ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తుండటం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారంటూ వివేక్ ట్వీట్ చేశారు.

- Advertisement -

పఠాన్ ను సోలో రిపబ్లిక్ డే రిలీజ్ గా చేయాలన్న యశ్ రాజ్ ఫిలిమ్స్ పై వివేక్ అగ్నిహోత్రి నీళ్లు చల్లుతున్నాడంటూ అప్పుడే విమర్శల జోరు ప్రారంభమైంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా రీ రిలీజ్ ను అస్సలు తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే కశ్మీరీ ఫైల్స్ లో బడ్జెట్ లో తయారైనా 340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రీ-రిలీజ్ అంటే దాని వసూళ్ల ప్రభావం పఠాన్ పై పడుతుందనే టాక్ అప్పుడే వైరల్ అవుతోంది. కరోనా కారణంగా అప్పట్లో సినిమాను థియేటర్లో చూడనివాళ్లు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోమని వివేక్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News