Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHariHara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ నిర్మాతకు అస్వస్థత.. క్లారిటీ ఇదే

HariHara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ నిర్మాతకు అస్వస్థత.. క్లారిటీ ఇదే

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'(HariHara VeeraMallu) నిర్మాత ఏఎం. ర‌త్నం అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైరల్ అవుతున్నాయి. చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరతం ఆయన స్పృహ తప్పి ప‌డిపోయార‌ని.. ప్రస్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఏఎం రత్నం సోద‌రుడు ద‌యాక‌ర్ రావు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘అన్నయ్య స్పృహ కోల్పోయారంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకండి’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శరవేగంగా జ‌రుపుకుంటోంది. తాజాగా ప‌వ‌న్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసిన‌ట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించారు. జాగర్లమూడి క్రిష్, జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad