Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ?

Kantara Chapter 1: సౌత్ సినిమా ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్ సినిమాల విషయంలోనూ కొన్ని రూమర్స్ ఫ్యాన్స్ ని మేకర్స్ ని కంగారు పెడుతుంటాయి. ఈ రూమర్స్ ఒక్కోసారి సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి జనాలలో విపరీతంగా ఆసక్తిని రేకెత్తిస్తే.. కొన్నిసార్లు మాత్రం నెగిటివ్ అయిపోయి సినిమా ఫ్లాపయ్యే ప్రమాదమూ ఉంది. కోట్లు పెట్టి తీసే సినిమాకి రూమర్స్ వల్ల పాజిటివ్ బజ్ క్రియేట్ అవకపోయినా పర్లేదు గానీ, నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయితేనే నిర్మాత జన్మలో కోలుకోలేని దెబ్బతింటాడు.

- Advertisement -

ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంతార: ఛాప్టర్ 1 సినిమా విషయంలోనూ ఇలాంటి ఓ రూమర్ వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గత కొన్ని నెలలుగా మన సౌత్ సినిమాలు చాలా వాయిదా పడుతూ వస్తున్నాయి. దాంతో ఆ సినిమాపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతున్న మాట వాస్తవం. తెలుగులోనే ప్రభాస్ సినిమాలు చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర కూడా.

Also Read- Darshan: జైల్లో ఉండ‌లేక‌పోతున్నా విష‌మివ్వండి.. జ‌డ్జినే రిక్వెస్ట్ చేసిన న‌టుడు ద‌ర్శ‌న్‌

ఇక బాలయ్య నటిస్తున్న అఖండ 2: తాండవం కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ది రాజాసాబ్ అనుకున్న తేదీకి రావడం లేదు. మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఈ మధ్య అనుష్క సినిమా ఘాటి కూడా ఇలాగే పలుమార్లు వాయిదా పడి రిలీజై ఫైనల్ గా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార సీక్వెల్ మూవీ కాంతార ఛాప్టర్ 1 విడుదల వాయిదా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మేకర్స్ కి చేరినట్టున్నాయి. ఫైనల్ గా వారు ఈ మూవీ రిలీజ్ విషయంలో కన్‌ఫర్మేషన్ ఇవ్వక తప్పలేదు. వాస్తవానికి అక్టోబర్ 2న కాంతార ఛాప్టర్ 1 రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

అయితే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఖండించడానికి తాజాగా ఈ సినిమా ప్రకటించిన తేదీకే వస్తున్నట్టుగా అధికారిక ప్రకటనను ఇచ్చారు. అలాగే, ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఇండియాతో పాటు ఇతర దేశాలలోనూ రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ హోంబలే ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది. కాగా, గతకొన్ని రోజుల నుంచి కాంతార సినిమాకి సంబంధించి ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. ఏదేమైనా, ఎవరెంత నెగిటివిటీ పెంచేసిన అది ఈ మూవీకి బాగా ప్లస్ అవుతోంది.

Also Read- SYG – Sambarala Yeti Gattu: గాసిప్స్ సాయి దుర్గ తేజ్ చెక్.. ‘సంబరాల ఏటిగట్టు’ రీ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad