Thursday, December 26, 2024
Homeచిత్ర ప్రభWe will create Brand to Tollywood: టాలీవుడ్ కు బ్రాండ్ క్రియేట్ చేస్తాం:...

We will create Brand to Tollywood: టాలీవుడ్ కు బ్రాండ్ క్రియేట్ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కేబినెట్ సబ్ కమిటీ

సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఇలా ఆసక్తిగా సాగింది.

- Advertisement -

సినిమా పరిశ్రమ సమస్యలను మా ద్రుష్టికి తెచ్ఛారన్న సీఎం రేవంత్, అనుమానాలు, అపోహలు, ఆలోచనలను సినీ ప్రముఖులు సర్కారుతో పంచుకున్నారన్నారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చినట్టు తెలిపారు. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చినట్టు వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. పరిశ్రమ బాగుండాలని తమ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

ఐటీ, ఫార్మాతో పాటు టాలీవుడ్ ముఖ్యం

ఐటీ, ఫార్మాతో పాటు మాకు సినిమా పరిశ్రమ మాకు ముఖ్యమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేసినట్టు టాలీవుడ్ ప్రముఖుల భేటీలో వివరించారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండానికి దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించినట్టు తెలిపారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఘాటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చన్న ఆయన, తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని భేటీలో టాలీవుడ్ కు సూచించారు.

హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా

ముంబయిలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని వివరించారు. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అంటూ, హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించటం విశేషం.

నెక్ట్స్ లెవెల్ కు ఇండస్ట్రీ

పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్న రేవంత్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు, 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్ లో పతకాలు తెచ్చుకోలేకపోతుందన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్న సీఎం, గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని టాలీవుడ్ కు గట్టిగా చెప్పారు.

ఇండస్ట్రీకి అంతా మేమే చేశాం

సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసాయని గుర్తుచేశారు. ఇదే వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని టాలీవుడ్ లో నయా ఉత్సాహం నింపే ప్రయత్నాన్ని ఈ భేటీ ద్వారా చేయటం హైలైట్. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత తనపై ఉందని, తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని కుండబద్ధలు కొట్టిమరీ టాలీవుడ్ ప్రముఖులకు తనపై ఉన్న అనుమానాలు పటాపంచలు చేశారు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామన్నారు, తమ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని టాలీవుడ్ కు హామీ ఇచ్చారు.

మొత్తానికి నేటితో టాలీవుడ్ కు సర్కారుకు మధ్య ఉన్న గ్యాప్ పూడినట్టైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News