ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా (Maha Kumbh Mela) వేడుక ప్రయాగ్‌రాజ్‌లో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా ప్రఖ్యాత మ్యూజిక్ బ్రాండ్ కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin), ఆయన స్నేహితురాలు డకోటా జాన్సన్ హాజరయ్యారు. వీరిద్దరూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల క్రిస్ మార్టిన్ భారత్‌లో వరుసగా కాన్సర్ట్‌లు నిర్వహిస్తున్నారు. ముంబైతో పాటు గుజరాత్ కాన్సర్ట్‌లు నిర్వహించగా.. భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఇదిలా ఉంటే ఇటీవల మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.