Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభBigg Boss Telugu 9: సమాజం సిగ్గు పడేలా బిగ్‌బాస్‌ షో.. పోలీస్‌ స్టేషన్‌లో కేసు...

Bigg Boss Telugu 9: సమాజం సిగ్గు పడేలా బిగ్‌బాస్‌ షో.. పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

Bigg Boss Season 9 Telugu: తెలుగులో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 9పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ షోను నిలిపివేయాలంటూ గజ్వేల్‌కి చెందిన కమ్మరి శ్రీనివాస్‌, బి. రవీందర్‌ రెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పు దోవ పట్టించేలా ఈ రియాలిటీ షో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బిగ్‌బాస్‌ సీజన్‌ 9ను తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/meenakshi-natarajan-phone-to-konda-surekha/

బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని.. కుటుంబ విలువలు పాటించని వారిని సమాజం సిగ్గు పడేలా బిగ్‌బాస్‌ షోను నిర్వహిస్తున్నారని నిర్వాహకులపై కమ్మరి శ్రీనివాస్‌, రవీందర్‌ రెడ్డి ఫిర్యాదులో చేశారు. షో నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటకలో ఈ షోను బ్యాన్‌ చేసిన విధంగా తెలుగులో కూడా బ్యాన్‌ చేయాలని కోరారు. లేకపోతే ప్రజాసంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

కాగా, ఇప్పటికే బిగ్‌బాస్‌ గత సీజన్లపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. షోను నిలిపివేయాలని పిటిషన్లు సైతం వేశారు. ఇలా చాలా విమర్శలు, ఫిర్యాదులు వస్తున్నా.. 8 సీజన్లు విజయవంతంగా ముగించుకుని 9వ సీజన్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక, హోస్ట్‌ నాగార్జున సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని ఫిర్యాదుదారులు సూచించారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/mahesh-babu-to-relaese-sudheer-babu-jatadhara-trailer/

ఇక, ప్రస్తుతం షోలో ఆరో కెప్టెన్సీ పోరు మొదలు కాగా.. వైల్డ్‌ కార్డ్స్‌ వర్సెస్‌ పాత హౌస్‌మేట్స్‌లా వార్‌ కొనసాగుతోంది. దివ్వెల మాధురి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశించినప్పటి నుంచి హౌస్‌లో నిత్యం వాదనలు జరుగుతున్నాయి. మాధురి వర్సెస్‌ హౌస్‌మేట్స్‌ అన్నట్లుగా వార్‌ ఉండగా.. మాధురి అందరిపై అరిచేస్తోంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ సీజన్‌9 తెలుగుపై ఫిర్యాదు నమోదైంది.   

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad