Coolie vs War 2: రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 మధ్య బాక్సాఫీస్ ఫైట్ టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠను పంచుతోంది. రెండు డబ్బింగ్ బొమ్మలే అయినా స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా కూలీ, వార్ 2లపై హైప్, బజ్ నెలకొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వార్ 2లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతోనే బాలీవుడ్‌లోకి కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. పేరుకు బాలీవుడ్ మూవీ అయినా తెలుగులోనే వార్ 2కు ఎక్కువగా క్రేజ్ కనిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు.
నాగార్జున విలన్…
కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా కొనసాగుతోన్న రజనీకాంత్‌కు తెలుగునాట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో అపజయమే లేని దర్శకుడిగా కొనసాగుతున్న లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ చేసిన లేటెస్ట్ మూవీ కూలీ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్‌గా నటించడం, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో కూలీపై తెలుగులో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్…
తెలుగులో కూలీ, వార్ 2 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌లు రికార్డ్ స్థాయిలో జరిగాయి. రజనీకాంత్ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ 45 కోట్ల వరకు జరిగింది. ఆంధ్రా ఏరియా హక్కులు 19 కోట్లకు అమ్ముడుపోగా…నైజాంలో ఏరియా బిజినెస్ 16 కోట్ల వరకు జరిగింది. ఓవరాల్‌గా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో కూలీ రిలీజ్ అవుతోంది.
600 కోట్లు టార్గెట్…
వరల్డ్ వైడ్‌గా మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూలీ అదరగొట్టింది. 305 కోట్ల కోట్ల వరకు రజనీకాంత్ మూవీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. 600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు కూలీ మూవీ సిద్ధమైంది.
కూలీకి డబుల్…
తెలుగు స్టేట్స్‌లో రజనీకాంత్ కూలీకి రెట్టింపుగా ఎన్టీఆర్ వార్ 2 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా తెలుగు హక్కులను 90 కోట్లకు సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న స్టార్‌డమ్ వల్ల వార్ 2 హక్కుల కోసం టాలీవుడ్‌లో గట్టి పోటీ ఏర్పడింది. తెలుగులో 92 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరల్డ్ వైడ్‌గా 340 కోట్ల వరకు వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఏడు వందల కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సివుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో…
ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తున్నా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం రజనీకాంత్ దూసుకుపోతున్నాడు. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు కూలీ ప్రీ సేల్స్ 85 కోట్ల వరకు జరగ్గా…వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం 21 కోట్లకు పరిమితమైంది.
కూలీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 350 కోట్లతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. వార్ 2 సినిమాను 400 కోట్లతో ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేశారు. వార్ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 రూపొందుతోంది.


