Coolie – War 2: రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 బాక్సాఫీస్ పోరు సినీ లవర్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రమోషన్స్‌లోనే కాదు అడ్వాన్స్ బుకింగ్స్‌లో వార్ 2పై కూలీ డామినేషన్ కనిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కూలీ ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంఛ్‌తో ఈ సినిమాపై రెండు భాషల్లో మంచి బజ్ ఏర్పడింది. మరోవైపు వార్ 2 ప్రమోషన్స్‌లో అంతగా జోష్ కనిపించడం లేదు. సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌లో సినిమా పట్ల హైప్ రప్పించేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ కూడా ఆడియెన్స్‌లో మోస్తరుగానే ఇంపాక్ట్ చూపించింది.
కూలీ బజ్ ఎక్కువ…
తెలుగులో వార్ 2 కంటే రజనీకాంత్ కూలీ మూవీపైనే ఎక్కువగా బజ్ కనిపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగార్జున విలన్‌గా కనిపించడం, ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్, సౌబీన్ షాహిర్ వంటి స్టార్స్ నటించారు. కోలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో కూలీ కోసం తెలుగు ఆడియెన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read- Heroine Arrest: మూడేళ్లుగా పరారీలో హీరోయిన్.. అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులు!
అడ్వాన్స్ బుకింగ్స్…
ఇప్పటికే ఓవర్‌సీస్‌లో తెలుగు వెర్షన్‌కు సంబంధించి వార్ 2, కూలీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అమెరికాలో కూలీ మూవీ అన్ని భాషల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ 1.1 మిలియన్లు దాటాయి. రిలీజ్‌కు ఇంకో తొమ్మిది రోజులు ఉండగానే వన్ మిలియన్‌ను దాటేసి ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ వాటా 250కే వరకు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వార్ 2 మూవీ తెలుగు, హిందీ భాషల్లో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ మాత్రం 200కే వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇందులో తెలుగు వెర్షన్ వాటా 150కే వరకు ఉండగా… హిందీ వెర్షన్ 50కే వరకు మాత్రమే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్టీఆర్ క్రేజ్ వల్లే…
ఓవర్‌సీస్‌లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్లే ఆ మాత్రమైన వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ మూవీస్‌కు ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఉండవు. ఎన్టీఆర్ నటించిన సినిమా అయినా వార్ 2 పట్ల ఓవర్‌సీస్ ఆడియెన్స్ అంతంగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం షాకింగ్‌కు గురిచేస్తుంది.
రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్…
ఎన్టీఆర్ స్టార్‌డమ్ కారణంగా వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. దాదాపు ఎనభై కోట్లకు వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకన్నారు. కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం వార్2లో సగమే జరిగింది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను 44 కోట్లకు ఏషియన్, సురేష్ సంస్థలు కొనుగోలు చేశాయి. బిజినెస్‌లో ముందున్న వార్ 2 బుకింగ్స్‌లో మాత్రం వెనుకబడిపోవడంతో షాకింగ్‌కు గురిచేస్తుంది.
వార్ 2 మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్ట్ 10న వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హృతిక్ రోషన్ కూడా అటెండ్ అవుతాడని అంటున్నారు.


