Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభCoolie Vs WAR 2: కూలీ vs వార్ 2.. యుఎస్ బాక్సాఫీస్ ప్రీమియర్స్ రికార్డ్స్‌

Coolie Vs WAR 2: కూలీ vs వార్ 2.. యుఎస్ బాక్సాఫీస్ ప్రీమియర్స్ రికార్డ్స్‌

Coolie Vs WAR 2: తెలుగు స్టార్స్ చలనచిత్ర మార్కెట్‌ను విస్తరించడంలో ముఖ్యంగా అమెరికా మార్కెట్‌ను బలోపేతం చేయడంలో ఫోక‌స్ చేస్తున్నారు. స్టార్ హీరో సినిమా విడుదల కావడానికి ముందే ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్‌లు బాక్సాఫీస్ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అనేక చిత్రాలు ప్రీమియర్ రికార్డులను సృష్టించగా ఇంకా విడుదల కానున్న కొన్ని సినిమాలు కూడా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల ముందే విడుదలయ్యే ప్రీ సేల్స్ బిజినెస్‌ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం ఇటు సౌత్‌లో రెండు సినిమాల మ‌ధ్య జ‌రుగుతోన్న బాక్సాఫీస్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. కూలీ vs వార్ 2 మధ్య జరుగుతున్న పోటీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో నిర్మితమయ్యాయి. ఈ రెండు సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్స్‌కు చెందినవి అయినప్పటికీ యూఎస్ఏలో టికెట్ బుకింగ్స్‌లో గట్టి పోటీతో నువ్వా నేనా అనే రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి.

• కూలీ చిత్రంపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ఇది యాక్షన్ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ర‌జినీకాంత్ వంటి స్టార్ హీరో.. లోకేష్ క‌న‌క‌రాజ్ వంటి డైరెక్టర్ కాంబినేషన్ ఈ సినిమాకు భారీ హైప్‌ను తెచ్చింది. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చే కంటెంట్ ఉందని మేకర్స్ చెబుతున్నారు.
• మరోవైపు వార్ 2 బాలీవుడ్, టాలీవుడ్ కాంబినేషన్‌తో పాన్ ఇండియా స్థాయిలో బజ్ సృష్టిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, భారీ స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకు ప్రధాన బలాలు.

విడుదలకు కేవలం రెండు రోజుల ముందు కూలీ, వార్ 2 మూవీస్ విష‌యంలో యూఎస్ కూలీ ప్రీ-సేల్స్‌లో ఏకంగా $533K (5 లక్షల 33 వేల డాలర్లు) వసూలు చేసింది. అదే సమయంలో, వార్ 2 $332K (3 లక్షల 32 వేల డాలర్లు) మార్కును చేరుకుంది. ఈ గణాంకాలు చూస్తుంటే, రెండు సినిమాలు కూడా విడుదల నాటికి మిలియన్ డాలర్ల మార్కును (10 లక్షల డాలర్లు) దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ఈ ఏడాది యూఎస్ఏలో విడుదలైన టాప్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ జాబితాలో ఈ రెండు సినిమాలు ఏయే స్థానాల్లో నిలిచాయనే విష‌యాల‌ను గ‌మ‌నిస్తే..

• గేమ్ చేంజర్: $650K
• కూలీ: $533K*
• హరిహర వీరమల్లు: $406K
• వార్ 2: $332K*
• కింగ్‌డమ్: $316K
• హిట్ 3: $268K

ALSO READ: https://teluguprabha.net/cinema-news/is-shruti-haasan-goodbye-to-telugu-film-industry/

ఈ జాబితాలో కూలీ రెండవ స్థానంలో.. వార్ 2 నాల్గవ స్థానంలో నిలిచాయి. ఈ లిస్టు చూస్తుటే ఈ రెండు సినిమాల‌కు ఉన్న భారీ క్రేజ్ ఏంటో తెలుస్తుంది. యూఎస్ఏ మార్కెట్‌లో ఇలాంటి పోటీలు సాధారణమే అయినప్పటికీ, కూలీ vs వార్ 2 పోరులో వసూళ్ల పరంగా ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు హీరోల అభిమానులు తమ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో ‘బాక్సాఫీస్ బ్యాటిల్ మొదలైంది’ అని ఉత్సాహంగా పోస్టులు చేస్తున్నారు. విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో బుకింగ్స్ వేగం మరింత పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషంలో వచ్చే డిమాండ్, ప్రీమియర్ డే కలెక్షన్లు ఈ పోరుకు తుది తీర్పునిస్తాయి. ఎవరు గెలుస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kamal-haasan-receives-death-threats-from-tv-actor-ravichandran/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad